Kissik vs Naa Naa Hyraanaa: కిస్సిక్ వర్సెస్ నానా హైరానా - ఏ పాటకు ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే? - ట్రోల్స్ భారీగానే!
Kissik vs Naa Naa Hyraanaa: పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌తో పాటు గేమ్ ఛేంజర్ నానా హైరానా చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ట్రెండింగ్స్ సాంగ్స్‌గా కొనసాగుతోన్నారు. రిలీజైన ఇరవై నాలుగు కిస్సిక్ సాంగ్‌కు 27 మిలియన్ల వ్యూస్ రాగా...నానా హైరానాకు 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Kissik vs Naa Naa Hyraanaa: ప్రస్తుతం యూట్యూబ్‌లో పుష్ప 2 కిస్సిక్‌తో పాటు గేమ్ ఛేంజర్ నానా హైరానా సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. రిలీజైన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు సాంగ్స్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేశాయి.
యూత్‌ను ఊపేస్తోంది...
కిస్సిక్ పాట రిలీజైన ఇరవై నాలుగు గంట్లలోనే 27.19 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకొని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూత్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కిస్సిక్ సాంగ్ ఊపు ఊపేస్తుంది.
నానా హైరానా వ్యూస్...
గేమ్ ఛేంజర్ నానా హైరానా సాంగ్‌కు ఇరవై నాలుగు గంటల్లో 23.44 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సాధారణంగా మెలోడీ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించడానికి టైమ్ పడుతుంది. కానీ నానా హైరానా తక్కువ టైమ్‌లోనే చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ట్రెండింగ్ సాంగ్‌గా నిలిచింది.
పుష్ప 2 టాప్...గేమ్ ఛేంజర్ సెకండ్ ప్లేస్...
టాలీవుడ్‌లో హిస్టరీలో లిరికల్ వీడియో సాంగ్స్‌లో రిలీజైన ఇరవై నాలుగు గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న పాటల్లో కిస్సిక్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...నానా హైరానా రెండో స్థానాన్ని దక్కించుకున్నది. మహేష్‌బాబు గుంటూరు కారంలోని ధమ్ మసాలా సాంగ్ 17 మిలియన్లతో మూడో ప్లేస్‌లో ఉండగా...గేమ్ ఛేంజర్ రారా మచ్చా (16 మిలియన్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మాస్ స్టెప్పులు...
కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదగొట్టారు. కిస్సిక్ సాంగ్‌ను శుబ్లాషిని ఆలపించింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో స్పెషల్ సాంగ్‌గా కిస్సిక్ కనిపించబోతున్నది.
కిస్సిక్‌పై ట్రోల్స్...
కిస్సిక్ సాంగ్‌కు ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగానే వచ్చాయి. పుష్ప మూవీలోని ఊ అంటావా పాట నేషనల్ వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించింది. కిస్సిక్ సాంగ్... ఊ అంటావా స్థాయిలో లేదని నెటిజన్లు చెబుతోన్నారు.
ట్యూన్స్, లిరిక్స్ విషయంలో ఊ అంటావా పాటలో ఊపు, బీట్ కిస్సిక్‌లో మిస్సయిందని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తోన్నారు. అంతే కాకుండా సినిమా కథ మొత్తం 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కానీ కిస్సిక్ పాటలోనే పదాలు మాత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చాలా పదాలు ఈ పాటలో వినిపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తోన్నారు.
ఎడిటింగ్‌పై విమర్శలు...
గేమ్ ఛేంజర్‌లోని నానా హైరానా పాటను శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ పాటను న్యూజిలాండ్‌లో భారీ వ్యయంతో షూట్ చేశారు. లిరిక్స్, ట్యూన్స్ పరంగా నానా హైరానా సాంగ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో నానా హైరానా సాంగ్‌పై దారుణంగా ట్రోల్ వస్తోన్నాయి.
పాట ఎడిటింగ్ సరిగా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తోన్న విజువల్స్‌కు, హీరోహీరోయిన్లకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా క్లియర్‌గా కనిపిస్తోన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. క్వాలిటీ పరంగా విజువల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు.
సంక్రాంతికి...
పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.