Lucky Baskhar OTT Release: థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దుమ్ముదులిపేస్తున్న లక్కీ భాస్కర్.. ఇదిగో సాక్ష్యం
Dulquer Salmaan Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అయినప్పటికీ.. థియేటర్లలో చూసిన వాళ్లు సైతం మళ్లీ ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు..?
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ.. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దుమ్ముదులిపేస్తోంది. అక్టోబరు 31న దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌తో పాటు యూత్‌ని అట్రాక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది.
రెండు రోజుల నుంచి స్ట్రీమింగ్
బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టిన లక్కీ భాస్కర్ సినిమా.. నవంబరు 28 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఓటీటీలో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాసుకొస్తున్నారు.
ఐఎండీబీలో బెస్ట్ రేటింగ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్‌కి జంటగా మీనాక్షి చౌదరి నటించగా.. 1990లో బ్యాంకింగ్స్, షేర్ మార్కెట్‌లోని లోపాల్ని ఎత్తిచూపుతూ ఈ సినిమాని రూపొందించారు. వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలకి కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్‌ని జోడించడంతో.. మూవీ అందరికీ కనెక్ట్ అయ్యింది. ఐఎండీబీ రేటింగ్‌లో 10 పాయింట్లకి లక్కీ భాస్కర్‌కి 8.3 రేటింగ్ రావడం గమనార్హం.
మంచి వసూళ్లు
లక్కీ భాస్కర్ మూవీ బడ్జెట్ రూ.56 కోట్లుకాగా.. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.109.82 కోట్లని ఈ సినిమా వసూళ్లని రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు వచ్చిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.
నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయగలిగే సినిమా ఈ లక్కీ భాస్కర్. థియేటర్లలో చూసిన వాళ్లు సైతం.. మరోసారి ఓటీటీలో చూస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
దుల్కర్ సల్మాన్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని సీన్స్‌లో తమని తాము ఊహించుకుని ఎమోషనల్ అవుతూ పోస్టులు పెడుతున్నారు.