India highest paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు
Highest paid Actress: మూడేళ్ల క్రితం సినిమా కోసం రూ.2 కోట్లు అందుకున్న హీరోయిన్.. ఇప్పుడే ఆ మూవీ సీక్వెల్ కోసం ఏకంగా ఐదు రెట్లు పారితోషికం పెంచేసింది.
ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా రష్మిక మంధాన నిలిచింది. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 : ది రూల్‌లో రష్మిక మంధాన నటించగా.. ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కాబోతోంది. ఈ మూవీ కోసం రికార్డు స్థాయిలో రష్మిక రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్మిక మంధాన పారితోషికం ఎంతంటే?
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2024 ముగింపు కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక మంధాన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెని పుష్ప-2తో మీరు అత్యధికంగా పారితోషికం అందుకున్న నటిగా నిలిచారట కదా? అని ప్రశ్నించారు. దాంతో నవ్వేసిన ఆమె.. ‘‘అది నేను అస్సలు ఒప్పుకోను.. ఎందుకంటే ఇది నిజం కాదు’’ అని నవ్వుతూ బదులిచ్చింది.
పుష్ప 2 సినిమా కోసం రష్మిక మంధాన ఏకంగా రూ.10 కోట్లు తీసుకుందని ఇండస్ట్రీ టాక్. 2021లో రిలీజైన పుష్ప-1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన రష్మిక మంధాన.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ యానిమల్ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. దాంతో ఈ అమ్మడు రెమ్యూనరేషన్‌ని కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.
నేషనల్ అవార్డుపై శ్రీవల్లి కన్ను
పుష్ఫ -1కి రష్మికకి రూ. 2 కోట్లు మాత్రమే పారితోషికం ఇవ్వగా.. మూడేళ్లలో ఆమె పారితోషికం 5 రెట్లు పెరగడం గమనార్హం. పుష్ప-2కు జాతీయ అవార్డు వస్తుందని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు రష్మిక చిరునవ్వుతో ‘వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ సమాధానమిచ్చింది.
రష్మిక ప్రస్తుతం.. ధనుష్, నాగార్జున అక్కినేనిలతో కుబేర, విక్కీ కౌశల్‌తో పీరియాడిక్ డ్రామా చావ, సల్మాన్ ఖాన్‌తో సికందర్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో తన ప్రేమ గురించి కూడా ఓపెన్‌గా రష్మిక మంధాన చెప్పేసిన విషయం తెలిసిందే.
12 వేల స్క్రీన్లలో పుష్ప రిలీజ్
పుష్ప-2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా.. ఇప్పటికే ఓవర్సీస్లోనూ పుష్ప 2 రికార్డుల మోత మోగించేస్తోంది.