Telugu Cinema News Live November 30, 2024: Sankranthiki Vasthunnam: వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’నుంచి మరో అప్‌డేట్.. ప్రొమో రిలీజ్‌తో సర్‌ప్రైజ్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 30 Nov 202404:29 PM IST
Godari Gattu Song Promo Release: సంక్రాంతి రేసులో ఉన్న వెంకటేశ్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గోదారి గట్టు పాట ప్రొమోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రమణ గోగుల వాయిస్‌తో అంచనాల్ని పెంచేస్తోంది.
Sat, 30 Nov 202401:45 PM IST
Fahadh Faasil New Movie on OTT: ఫహాద్ ఫాజిల్ నటించిన మూవీ బోగన్ విల్లియా అక్టోబరులో థియేటర్లలో విడుదలై హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి రాబోతోంది. ఎక్కడ చూడొచ్చంటే?
Sat, 30 Nov 202412:01 PM IST
Parachute Web Series: కుటుంబ నేపథ్యంతో వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని ఓటీటీలో ఇప్పుడు పారాచూట్ తీర్చేస్తోంది. ఒక చిన్న బైక్ చుట్టూ కథని తిప్పిన దర్శకుడు రసు రంజిత్.. మనతో తెలియకుండానే కన్నీళ్లు పెట్టించేస్తాడు.
Sat, 30 Nov 202411:01 AM IST
- Bigg Boss Telugu 8 Tasty Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఇవాళ టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 ఎపిసోడ్ షూటింగ్ ఈపాటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలో హౌజ్‌లో 2 నెలలు ఉన్న టేస్టీ తేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో చూద్దాం.
Sat, 30 Nov 202410:21 AM IST
Mirzapur fame Divyenndu: మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో అందర్నీ కట్టిపడేసిన క్యారెక్టర్ మున్నా భయ్యా .. తనకి నచ్చినట్లు చేసే మున్నా భయ్యా ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడినా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మున్నా భయ్యా తెలుగులో సినిమా చేయబోతున్నాడు.
Sat, 30 Nov 202410:12 AM IST
కెవిన్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ దా..దా తెలుగులోకి వస్తోంది. పా..పా పేరుతో డిసెంబర్ 13న రిలీజ్ అవుతోంది. నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తమిళంలో 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
Sat, 30 Nov 202409:21 AM IST
Hari Hara Veera Mallu Updates: రాజకీయాల్లో ఇటీవల బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్.. చాలా రోజుల తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు సెట్స్‌లో అడుగు పెట్టారు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుందంటే?
Sat, 30 Nov 202409:06 AM IST
- Lucky Bhaskar OTT Streaming And Trending: ఓటీటీలో తెలుగు బ్యాంకర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్ దుమ్ముదులుపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను దాటేసి మరి నెంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 8.3 రేటింగ్ సాధించిన లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Sat, 30 Nov 202407:59 AM IST
- Zee Telugu Pelli Sandadi Mega Event Selfie Contest: బుల్లితెర ప్రేక్షకులకు జీ తెలుగు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇవాళ అభిమాన సీరియల్ హీరో హీరోయిన్స్‌ను తమ ఇంట్లోకి వచ్చే అవకాశాన్ని జీ తెలుగు అందిస్తోంది. జగ్గయ్యపేటలో జీ తెలుగు పెళ్లి సందడి మెగా ఈవెంట్ జరగనుంది.
Sat, 30 Nov 202407:21 AM IST
Sonu Sood Received Sankalp Kiran Award: టాలీవుడ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ సంకల్ప్ కిరణ్ పురస్కారం వరించింది. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో వ్యాపారవేత్త వై కిరణ్ పుట్టినరోజు సందర్భంగా సోనూ సూద్ సంకల్ప్ అవార్డ్ అందుకున్నారు.
Sat, 30 Nov 202407:20 AM IST
OTT: అమరన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఫిక్సైంది. డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఈస్ట్రీమింగ్ కాబోతోంది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.
Sat, 30 Nov 202406:20 AM IST
Matka OTT: వరుణ్ తేజ్ మట్కా మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. మట్కా మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
Sat, 30 Nov 202406:19 AM IST
- OTT Release Movies Telugu: ఓటీటీలోకి నిన్న ఒక్కరోజు నుంచే 26 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో పది చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో కేవలం నాలుగు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ సస్పెన్స్, యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్‌గా ఉన్నాయి.
Sat, 30 Nov 202405:28 AM IST
Pushpa 1 vs Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. 2021 వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప కు రీమేక్‌గా పుష్ప 2 తెరకెక్కుతోంది. పార్ట్ వన్‌తో పోలిస్తే సీక్వెల్‌లో ఎలాంటి మార్పులు చేశారు? కొత్తగా కనిపించే పాత్రలు ఏవంటే?
Sat, 30 Nov 202405:01 AM IST
- Thalapathy Vijay Son Jason Sanjay Sundeep Kishan Movie: దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా మారాడు. దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న జానస్ సంజయ్ తెరకెక్కిస్తోన్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Sat, 30 Nov 202403:30 AM IST
- Vikatakavi OTT Web Series Costume Designer Josyula Gayathri Devi: ఓటీటీ వెబ్ సిరీస్‌లకు ఎక్కువగా కాస్టూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన విజయనగరం అమ్మాయి జోశ్యుల గాయత్రి దేవి. తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్‌లు సర్వం శక్తి మయం, వికటకవి, హరికథకు పని చేసిన జోశ్యుల గాయత్రి దేవి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
Sat, 30 Nov 202403:24 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో బాలు అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా జాబ్ చేస్తున్నాడని తెలిసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు మనోజ్ ద్వారానే రవి, శృతిలను తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది ప్రభావతి. రోహిణి ముందు మనోజ్‌ను ఇరికించేస్తుంది.
Sat, 30 Nov 202402:49 AM IST
- Brahmamudi Serial November 30th Episode: బ్రహ్మముడి నవంబర్ 30 ఎపిసోడ్‌లో డబ్బులిస్తా అన్న రాజ్‌ను ధులిపేసి పోతుంది కావ్య. ఇంట్లోకి నెలకు లక్ష రూపాయలకు కొత్త పనిమనిషి స్టెల్లాను తీసుకొస్తున్నట్లు రాజ్ చెబుతాడు. ఆకలికి ఆగని రాజ్ దొంగతనంగా కావ్య చేసిన వంట తింటాడు. అది ఇందిరాదేవి, సీతారామయ్య చూస్తారు.
Sat, 30 Nov 202402:00 AM IST
- Karthika Deeapam 2 Today Episode November 30: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. కుబేర్ మృతి, దీప పరిచయం గురించి కాంచన, అనసూయ ముందు నిజం చెప్పేస్తాడు. శివన్నారాయణ ఇంటికి దాసు వస్తాడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Sat, 30 Nov 202401:57 AM IST
Kissik vs Naa Naa Hyraanaa: పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌తో పాటు గేమ్ ఛేంజర్ నానా హైరానా చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ట్రెండింగ్స్ సాంగ్స్‌గా కొనసాగుతోన్నారు. రిలీజైన ఇరవై నాలుగు కిస్సిక్ సాంగ్‌కు 27 మిలియన్ల వ్యూస్ రాగా...నానా హైరానాకు 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Sat, 30 Nov 202401:19 AM IST
- Bigg Boss Telugu 8 Double Elimination Thirteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉండనుందని సమాచారం. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ పూర్తి కానున్న నేపథ్యంలో ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
Sat, 30 Nov 202412:42 AM IST
Time Travel OTT: కన్నడ టైమ్ ట్రావెల్ మూవీ మర్ఫీ ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కన్నడ మూవీ రిలీజ్ కాబోతోంది. బీఎస్ ప్రదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభు ముండ్కూర్, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు.