Bigg Boss Elimination: మారిన ఓటింగ్ స్థానాలు- ఈ వారం పక్కాగా రెండు సార్లు ఎలిమినేషన్- ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్!-bigg boss telugu 8 thirteenth week double elimination prithvi tasty teja bigg boss 8 telugu elimination this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: మారిన ఓటింగ్ స్థానాలు- ఈ వారం పక్కాగా రెండు సార్లు ఎలిమినేషన్- ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్!

Bigg Boss Elimination: మారిన ఓటింగ్ స్థానాలు- ఈ వారం పక్కాగా రెండు సార్లు ఎలిమినేషన్- ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్!

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Double Elimination Thirteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉండనుందని సమాచారం. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ పూర్తి కానున్న నేపథ్యంలో ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

మారిన ఓటింగ్ స్థానాలు- ఈ వారం పక్కాగా రెండు సార్లు ఎలిమినేషన్- ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎలిమినేట్!

Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనుందని సమాచారం. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో ఉంటారు. మిగిలిన వారు దాదాపుగా ఎలిమినేట్ అవుతూ వెళ్తారు.

పక్కాగా డబుల్ ఎలిమినేషన్

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం రెండు సార్లు ఎలిమినేషన్ కానుందని సమాచారం. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్ మలియక్కల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అవినాష్, నబీల్ అఫ్రీది తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.

నామినేషన్స్‌లో 8 మంది

వీరందరికి బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ ఒక్కరోజు మాత్రమే జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, నిఖిల్, అవినాష్, నబీల్ ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తికావడంతోనే ఓటింగ్ పోల్ ఓపెన్ అయిపోయింది.

మారిన ఓటింగ్ స్థానాలు

బిగ్ బాస్ ఓటింగ్‌లో ఈ వారం మొదట్లో గౌతమ్ టాప్ 1 స్థానంలో కొనసాగగా.. రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు. అయితే, వీకెండ్ వచ్చేసరికి వీరి స్థానాలు మారిపోయాయి. దీంతో మొదటి స్థానంలో నిఖిల్, రెండో స్థానంలోకి గౌతమ్ వచ్చేశాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ అలాగే కొనసాగింది. నాలుగో స్థానంలో విష్ణుప్రియ ఉంటే ఐదో స్థానంలో నబీల్ నిలిచాడు. వీరి స్థానాలు కూడా వీకెండ్‌కు ఇలా ఉన్నాయి. కానీ, మొదట్లో మాత్రం బాటమ్‌లో ఉన్నారు.

అవినాష్ సేఫ్

ఇక ఆరో స్థానంలో అవినాష్, ఏడో స్థానంలో టేస్టీ తేజ, ఎనిమిదో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నారు. అంటే, ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌లో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఉన్నారు. కానీ, బిగ్ బాస్ ఫైనలిస్ట్‌గా అవినాష్ గెలిచి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లిపోయాడు. కాబట్టి, ఒకవేళ అవినాష్‌కు అతి తక్కువ ఓటింగ్ పడిన కూడా ఎలిమినేట్ కాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతాడు.

రెండు సార్లు ఎలిమినేషన్

ఈ లెక్కన ఎక్కువ డేంజర్ జోన్‌లో ఉంది టాప్ 3 బాటమ్‌లో ఉన్నవాళ్లే. అంటే, నబీల్, టేస్టీ తేజ, పృథ్వీ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం టేస్టీ తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అవనున్నారని టాక్. అది కూడా ఇవాళ (నవంబర్ 30) ఒకరు, ఆదివారం (డిసెంబర్ 1) మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

పృథ్వీ, టేస్టీ తేజ ఎలిమినేట్

అతి తక్కువ ఓటింగ్ తెచ్చుకున్న పృథ్వీ ఇవాళ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. లేదా, టేస్టీ తేజను ఇవాళ ఎలిమినేట్ చేస్తారు. ముందు వెనుక తప్పితే ఇవాళ, రేపు తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండు సార్లు ఎలిమినేషన్ లేకపోతే గనుక సింగిల్‌గా మాత్రం టేస్టీ తేజ ఒక్కడినే ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.