Bigg Boss 8 Telugu Contestants: మారిన బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్- కొత్తగా ఐదుగురు- బేబి నటితోపాటు ఎంతమంది అంటే?
Bigg Boss Telugu 8 Contestants List: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ తాజాగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి వెళ్తారని టాక్ రాగా.. వారిలోనే మార్పులు జరిగినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం కొత్తగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారు ఎవరంటే?
Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ రోజుకోసారి మారిపోతుంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్‌గా వెళ్లనున్నట్లు ఇప్పటివరకు 14 మంది సెలబ్రిటీలు పేర్లు గట్టిగా వినిపించాయి. వీరంతా దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం అందింది.
ఇంతవరకు చేయని సైన్
అయితే, వీరిలో కొంతమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లేందుకు ఇంకా అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వారిలో చక్రవారం ఫేమ్ ఇంద్రనీల్ వర్మ ఇప్పటివరకు బిగ్ బాస్‌కు వెళ్లేందుకు సైన్ చేయలేదట. అలాగే జబర్దస్త్ రీతూ చౌదరి కూడా వెళ్లడం డౌటే అని టాక్ నడుస్తోంది.
తొమ్మిది మంది
ఈ ఇద్దరితోపాటు కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూమ్ అలీ కూడా ఇంకా బిగ్ బాస్ అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదని వినికిడి. అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లేందుకు 9 మంది కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం. వారిలో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్, యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ బాషా, హీరో ఆదిత్య ఓం, సీరియల్ నటీమణులు అంజలి పవన్, యష్మీ గౌడ ఉన్నారు.
ఏవీ షూట్
అలాగే యూట్యూబర్ బెజవాడ బేబక్క, హీరోయిన్ విస్మయ శ్రీ, హీరో అభిరామ్ వర్మ కూడా ఉన్నారు. వీరిలో శేఖర్ బాషా ఏవీ షూట్ బుధవారం (ఆగస్ట్ 28) కానుందని సమాచారం. ఈ తొమ్మిదిమందితోపాటు హౌజ్‌లోకి వెళ్లేందుకు కన్ఫర్మ్ అయినట్లుగా కొత్తగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో న్యూస్ రీడర్ కల్యాణి ఉందని తెలుస్తోంది.
కిర్రాక్ సీత కన్ఫర్మ్
యాంకర్ కల్యాణి బిగ్ బాస్ 8 తెలుగులో కంటెస్టెంట్‌గా పాల్గొనున్నట్లు సమాచారం. అలాగే బేబి మూవీలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసిన కిర్రాక్ సీత బిగ్ బాస్ 8 తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుందట. యూట్యూబ్‌లో 7ఆర్ట్స్ ఛానెల్‌లో డిఫరెంట్ కంటెంట్ వీడియోలతో కిర్రాక్ సీత చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టనుంది.
మొత్తం 15 మంది
ఇంకా బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లే కంటెస్టెంట్స్‌లలో అభయ్ నవీన్, సహర్ కృష్ణన్, నాగ మణికంఠ ఉన్నారు. వీరి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వీరందరిని కలుపుకుని బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా వెళ్లనునున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరో యూట్యూబర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడట. దీంతో మొత్తం 15 మంది సెలబ్రిటీలు అవుతున్నారు.
ముందుగా 14 మంది ఎంట్రీ
సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రారంభం అయ్యే బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ రోజున ముందు 14 మంది హౌజ్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది సెలబ్రిటీలను హౌజ్‌లోకి దించనున్నట్లు టాక్. కాగా ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.