Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో పెను మార్పులు- నామినేషన్స్‌తో అతనికి ఫుల్ నెగెటివిటీ- కన్నడ గుంపులో ఒకరు ఎలిమినేట్-bigg boss telugu 8 12th week nominations voting results prerana in top bigg boss elimination this week yashmi or prithvi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో పెను మార్పులు- నామినేషన్స్‌తో అతనికి ఫుల్ నెగెటివిటీ- కన్నడ గుంపులో ఒకరు ఎలిమినేట్

Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో పెను మార్పులు- నామినేషన్స్‌తో అతనికి ఫుల్ నెగెటివిటీ- కన్నడ గుంపులో ఒకరు ఎలిమినేట్

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2024 02:27 PM IST

Bigg Boss Telugu 8 12th Week Nominations Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్ ఓటింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్ వల్ల టైటిల్ విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్‌కు ఫుల్ నెగెటివిటీ వచ్చేసింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూద్దాం.

బిగ్ బాస్ ఓటింగ్‌లో పెను మార్పులు- నామినేషన్స్‌తో అతనికి ఫుల్ నెగెటివిటీ- కన్నడ గుంపులో ఒకరు ఎలిమినేట్
బిగ్ బాస్ ఓటింగ్‌లో పెను మార్పులు- నామినేషన్స్‌తో అతనికి ఫుల్ నెగెటివిటీ- కన్నడ గుంపులో ఒకరు ఎలిమినేట్ (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్ మాములుగా జరగలేవు. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేయించారు బీబీ టీమ్. ఇది హౌజ్‌మేట్స్‌తోపాటు కంటెస్టెంట్స్‌కు కూడా బిగ్ షాక్ ఇచ్చింది.

బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్ రెండు రోజుల పాటు సాగిన విషయం తెలిసిందే. మంగళవారం (నవంబర్ 19) నాటికి బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు నామినేట్ అయ్యారు. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ, నబీల్ ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.

టైటిల్ విన్నర్ మెటీరియల్

ఈ వారం సింగిల్ నామినేషన్ ఓట్‌ వచ్చిన వారు సైతం నామినేట్ అయ్యారు. నబీల్‌కు ఒక నాగ మణికంఠ నుంచే నామినేషన్ వచ్చింది. అలాగే, అందరికంటే ఎక్కువగా టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌కు నామినేషన్స్ ఓట్లు పడ్డాయి. సోనియా ఆకుల, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, బేబక్క నలుగురు నిఖిల్‌నే నామినేట్ చేశారు.

సోనియా, సీత కామెంట్స్‌తో

నిఖిల్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను లవ్ పేరుతో యూజ్ చేసుకుంటున్నట్లుగా దారుణమైన కామెంట్స్ చేసింది సీత. అంతకంటే ముందు యష్మీ ఫీలింగ్స్‌కు రెస్పెక్ట్ ఇవ్వకుండా తను ఇష్టపడటం గురించి ఇతరులతో చెబుతున్నావంటూ నిఖిల్‌పై సోనియా ఫైర్ అయింది.

పడిపోయిన నిఖిల్ ఓటింగ్

ఇలా 12వ వారం నామినేషన్స్‌తో ఒక్కసారిగా నిఖిల్ ఫుల్ నెగెటివిటీ తెచ్చుకున్నాడు. దాంతో అతని ఓటింగ్‌లో పెను మార్పు చోటు చేసుకుంది. దాంతో 20.51 శాతం ఓటింగ్‌తో నిఖిల్ రెండో స్థానంలోకి పడిపోయాడు. ఎప్పుడైనా బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో ఉండే నిఖిల్ నెగెటివిటీ కారణంగానే రెండో ప్లేస్‌కు పడిపోయినట్లుగా తెలుస్తోంది.

డేంజర్ జోన్‌లో ఇద్దరు

ఇక ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో 24.56 శాతం ఓటింగ్‌తో ప్రేరణ నిలిచింది. మరో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నబీల్ 19.28 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. కోపిష్టిగా పేరు తెచ్చుకున్న పృథ్వీ 19.27 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. బ్యూటిఫుల్ యష్మీ గౌడ 16.38 శాతంతో ఐదో స్థానంలో ఉంది. అంటే, పృథ్వీ, యష్మీ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు.

గ్రూప్ గేమ్

అయితే, ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. కన్నడ బ్యాచ్‌కు చెందిన వీరిద్దరిలో ఎక్కువగా యష్మీనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ కన్నడకు చెందినవారు. దాంతో వారిని కన్నడ బ్యాచ్ అని, కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నెటిజన్స్, ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

కన్నడ బ్యాచ్‌లో ఒకరు

అలాగే, నామినేట్ చేయడానికి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా ప్రేరణ, యష్మీలను గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే కారణాలతో నామినేట్ చేశారు. కాబట్టి, ఈ వారం కన్నడ బ్యాచ్‌ (గుంపు)లో ఒకరు ఎలిమినేట్ అవడం పక్కా అని తెలుస్తోంది.

Whats_app_banner