Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి యష్మీ గౌడ ఎలిమినేట్.. 12 వారాల్లో ముకుంద ఎంత డబ్బు సంపాదించిందంటే?-bigg boss telugu 8 this week elimination yashmi gowda remuneration for 12 weeks bigg boss 8 telugu yashmi remuneration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి యష్మీ గౌడ ఎలిమినేట్.. 12 వారాల్లో ముకుంద ఎంత డబ్బు సంపాదించిందంటే?

Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి యష్మీ గౌడ ఎలిమినేట్.. 12 వారాల్లో ముకుంద ఎంత డబ్బు సంపాదించిందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 24, 2024 06:46 AM IST

Bigg Boss Telugu 8 Yashmi Gowda Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ నిన్న (నవంబర్ 23) పూర్తి కాగా ఇవాళ (నవంబర్ 24) చూపించనున్నారు. ఈ నేపథ్యంలో హౌజ్‌లో 12 వారాలు ఉన్న యష్మీ గౌడ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో చూద్దాం.

బిగ్ బాస్ నుంచి యష్మీ గౌడ ఎలిమినేట్.. 12 వారాల్లో ముకుంద ఎంత డబ్బు సంపాదించిందంటే?
బిగ్ బాస్ నుంచి యష్మీ గౌడ ఎలిమినేట్.. 12 వారాల్లో ముకుంద ఎంత డబ్బు సంపాదించిందంటే?

Bigg Boss 8 Telugu Yashmi Gowda Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి మరో వికెట్ పడిపోయింది. నిజానికి బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అకాశం ఉందని చాలా రూమర్స్ వినిపించాయి. దాంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని, అది కూడా శనివారం (నవంబర్ 23) ఒకరు, ఆదివారం (నవంబర్ 24) మరొకరు ఎవిక్ట్ అయి వెళ్లిపోతారని జోరుగా టాక్ వినిపించింది.

ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌తో

కానీ, అలా జరగకుండా బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం జరిగిన నామినేషన్స్ బీబీ చరిత్రలో మొదటిసారిగా జరిగాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోనే తొలిసారిగా తీసుకొచ్చారు. దీంతో ఈ నామినేషన్స్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు

రెండు రోజులపాటు సాగిన బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్‌లో నిఖిల్ మలియక్కల్, ప్రేరణ కంబం, యష్మీ గౌడ, పృథ్వీరాజ్ శెట్టి, నబీల్ అఫ్రీది ఐదుగురు నామినేట్ అయిన విషయం తెలిసిందే. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే ఓటింగ్ పోల్స్ ఓపెన్ కాగా రోజు రోజు హెచ్చు తగ్గులతో ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ నడిచింది.

యష్మీ గౌడ ఎలిమినేట్

టాప్‌లో ఉన్న వాళ్లు డేంజర్ జోన్‌లోకి ఎలిమినేట్ అవుతారనుకున్న వాళ్లు టాప్‌లోకి ఇలా వస్తూ వెళ్తూ బిగ్ బాస్ ఓటింగ్ జరిగింది. ఇక ఫైనల్‌గా బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో చివరి రెండు స్థానాల్లో పృథ్వీరాజ్, యష్మీ గౌడ ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఇద్దరిలో ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ కాగా పృథ్వీరాజ్ సేఫ్ అయ్యాడు.

వారానికి యష్మీ పారితోషికం

దాంతో బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం యష్మీ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోగా.. పృథ్వీ బిగ్ బాస్ ఇంట్లోకి సేఫ్‌గా వెళ్లాడు. ఈ నేపథ్యంలో యష్మీ గౌడ రెమ్యునరేషన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొన్నందుకు యష్మీ గౌడ సుమారుగా వారానికి రూ. 2 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. అంటే, రోజుకు దాదాపుగా రూ. 28, 571.

రెండున్నర లక్షలు అంటూ!

సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగులోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ 12 వారాలు (దాదాపుగా 83 రోజులు) హౌజ్‌లో ఉంది. ఈ లెక్కన 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అయితే, యష్మీ గౌడ వారానికి రెండున్నర లక్షల రూపాయల పారితోషికం అందుకుందని మరో టాక్ కూడా నడుస్తోంది.

యష్మీ సంపాదించింది ఎంత?

ఇలా చూసుకుంటే, 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 30 లక్షల డబ్బు సంపాదించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే, రోజుకు రూ. 35, 714 పారితోషికం తీసుకున్నట్లు అనుకోవచ్చు. రోజూ వారీగా లెక్కలేస్తే 83 రోజులకు యష్మీ గౌడ రూ. 29, 64, 285 పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కాస్తా అటు ఇటుగా కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో విలన్ ముకుందగా ఆకట్టుకున్న యష్మీ బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా రూ. 30 లక్షల వరకు డబ్బు సంపాందించినట్లు సమాచారం.

Whats_app_banner