Bigg Boss Winner: తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!-bigg boss telugu 8 winner is prerana kambam by search engine google bigg boss 8 telugu title winner prerana revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Winner: తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!

Bigg Boss Winner: తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!

Sanjiv Kumar HT Telugu
Oct 24, 2024 04:36 PM IST

Bigg Boss Telugu 8 Winner By Google: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఇప్పుడే తెలిసిపోయింది. బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్ జాబితాలో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా ఎవరు ఊహించని కంటెస్టెంట్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 విజేతను అనూహ్యంగా గూగుల్ తల్లి ప్రకటించేసింది.

తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!
తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu 8 Winner: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హవా నడుస్తోంది. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ తెలుగులోకి పెద్దగా తెలియని సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టిన వారిలో కొంతమంది మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా, విన్నర్ మెటీరియల్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

yearly horoscope entry point

బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్

వారిలోనే ఒకరికి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవడం, వారి ఆట నచ్చడంతో విజేతగా నిలుస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌ను గ్రాండ్ ఫినాలే కార్యక్రమం నిర్వహించి ప్రకటిస్తారు. అయితే, కొన్నిసార్లు బిగ్ బాస్ సీజన్ ముగియడానికి ముందే టైటిల్ విజేత ఎవరో తెలిసిపోతుంది. కొన్ని సీజన్స్‌లలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ముందుగానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేస్తుంటుంది.

అలా ఇదివరకు బిగ్ బాస్ తెలుగు 4, బిగ్ బాస్ తెలుగు 6 సీజన్స్ టైటిల్ విజేతలు ఎవరో గ్రాండ్ ఫినాలే రాకముందే గూగుల్ తల్లి ప్రకటించేసింది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ముగియడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, ఇప్పుడే బిగ్ బాస్ 8 తెలుగు విజేతను గూగుల్ చెప్పేసింది అని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.

ఇక సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఆరుగురు ఎలిమినేట్ కావడంతో తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ ఎంట్రీ ఇచ్చారు. దాంతో హౌజ్‌లో 16 మంది ఉన్నారు. ఆ తర్వాత కిర్రాక్ సీత, నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

ప్రస్తుతం 14 మంది

దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో 14 మంది అంటే, నిఖిల్, పృథ్వీ, నబీల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ, రోహిణి, గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. వీరిలో ఎక్కువగా టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా నిఖిల్ ఉన్నాడు. ఆ తర్వాత ఆట పరంగా అందరి మనసులు గెలుచుకున్న నబీల్ ఉన్నాడు.

వీరిద్దరు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు టాప్‌లో ఓటింగ్‌లో ఉండేవారు. విష్ణుప్రియకు చాలా మంచి ఫ్యాన్ బేస్‌తో ఓటింగ్ పడినప్పటికీ రోజురోజుకీ తన ఆటతో పాడుచేసుకుంటుంది. దాంతో కిందకు పడిపోతుంది విష్ణుప్రియ. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో అవినాష్, మెహబూబ్ కాస్తా పోటీ ఇచ్చేవాళ్లుగా కనిపించారు.

అయితే, వీళ్లలో ఏ ఒక్కరు కాకుండా ఎవరు ఊహించని ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విజేత కానున్నారని గూగుల్ తెలిపింది. అది ఎవరో కాదు ప్రేరణ కంబం. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్‌గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ ఆటపరంగా అబ్బాయిలకు తగ్గాఫర్ ఇస్తోంది.

ఏకంగా టాప్‌కు

ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉంటూ విన్నర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిగా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ఓటింగ్‌లో కూడా నిఖిల్, నబీల్‌ను దాటేసి ఏకంగా టాప్‌లో మొదటి స్థానంలో కూర్చుంది. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరు అని గూగుల్‌లో టైప్ చేస్తే ప్రేరణ పేరు వస్తుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

దీన్ని బట్టి ఈ సీజన్‌లో ఎవరు ఊహించనివిధంగా లేడి కంటెస్టెంట్ విన్నర్ కానుందని గూగుల్ తల్లి చెప్పింది. అయితే, దీంట్లో సీజన్ పూర్తయ్యే సరికి మార్పులు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ పూర్తయ్యేసరికి గూగుల్ చెప్పిన ప్రేరణనే విన్నర్ అవుతుందా.. లేదా ఇంకెవరైనా అవుతారో వేచి చూడాలి.

బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో చెప్పిన గూగుల్
బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో చెప్పిన గూగుల్
Whats_app_banner