Family electric scooter : హోండా యాక్టివ్​ ఎలక్ట్రిక్​ సేల్స్​ ఎప్పుడు మొదలవుతాయి? కీలక అప్డేట్​ ఇదిగో..-honda activa electric to go on sale from spring 2025 colour options detailed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Family Electric Scooter : హోండా యాక్టివ్​ ఎలక్ట్రిక్​ సేల్స్​ ఎప్పుడు మొదలవుతాయి? కీలక అప్డేట్​ ఇదిగో..

Family electric scooter : హోండా యాక్టివ్​ ఎలక్ట్రిక్​ సేల్స్​ ఎప్పుడు మొదలవుతాయి? కీలక అప్డేట్​ ఇదిగో..

Sharath Chitturi HT Telugu
Nov 30, 2024 06:41 AM IST

Honda Activa electric : ఇటీవలే లాంచ్​ అయిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ మీకు నచ్చిందా? ఈ ఈ-స్కూటర్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఈ వివరాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​
హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​

మచ్​ అవైటెడ్​ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా మోటార్​సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). తద్వారా హై-డిమాండ్​, అధిక పోటీ ఉన్న ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది. కాగా, 'యాక్టివా ఈ'తో పాటు క్యూసీ 1 అనే స్కూటర్​ని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ రెండు ఈ-స్కూటర్లు బెంగళూరు సమీపంలోని ఫ్యాక్టరీలో తయారవుతాయి. మరీ ముఖ్యంగా హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ ఒక ఫ్యామిలీ స్కూటర్​గా మంచి ఆదరణ పొందుతుందని సంస్థ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో యాక్టివా ఈవీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్​ని ఇక్కడ తెలుసుకోండి..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ సేల్స్​ ఎప్పుడు స్టార్ట్​?

హోండా యాక్టివా ఎలక్ట్రిక్, క్యూసీ 1​ స్కూటర్ల​ సేల్స్​పై సంస్థ కీలక అప్డేట్​ ఇచ్చింది. ఈ రెండూ కూడా.. 2025 స్ప్రింగ్​, అంటే వచ్చే ఏడాది మార్చ్​-మే మధ్యలో సేల్​లోకి వెళతాయి. వీటికి సంబంధించిన బుకింగ్స్​ 2025 జనవరిలో స్టార్ట్​ అవుతాయి. ఆ సమయంలోనే ధరల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

పర్ల్ సెరెనిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పర్ల్ మిస్టీ వైట్, పర్ల్ షాడో బ్లూ, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అనే ఐదు విభిన్న కలర్ ఆప్షన్లలో హోండా యాక్టివా ఈ అందుబాటులోకి వస్తుంది.

యాక్టివా ఈ- క్యూసీ 1 కంటే భిన్నంగా ఉంటుంది! రెండు వైపులా ఎల్​ఈడీ కాంబినేషన్ లైట్లు, ఇండికేటర్లు, హై-మౌంటెడ్ రాప్అరౌండ్ డీఆర్ఎల్ యూనిట్​ వంటివి ఉంటాయి. యాక్టివా ఎలక్ట్రిక్​లో​ రెండు స్వాపెబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇది అధిక స్థాయి ఛార్జింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. స్వాప్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్​ఎంఎస్​ఐ పేర్కొంది.

హోండా యాక్టివా ఈ: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ డే అండ్ నైట్ మోడ్​లతో కూడిన 7 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లేను అమర్చారు. ఇది స్మార్ట్​ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం హోండా రోడ్సింక్ డుయోను కలిగి ఉంది. ఈ-స్కూటర్​లో 6 కిలోవాట్ల మోటారు, రెండు స్వాపబుల్ 1.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. యాక్టివా ఈ స్కూటర్​ సింగిల్ ఛార్జ్ రేంజ్​ 102 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 7.3 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్​లను స్టాండర్డ్​గా అందిస్తోంది సంస్థ.

హోండా యాక్టివా ఈ స్కూటర్​: ప్రత్యర్థులు..

కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్.. టీవీఎస్ ఐక్యూబ్, వీసా వి1, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ప్రో, సింపుల్ వన్, యాంపియర్ నెక్సస్ వంటి మోడల్స్​తో పోటీపడనుది.

మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ని భారతదేశంలోని హోండా డీలర్​షిప్లలో కొనుగోలు చేయవచ్చు. అమ్మకాలు 2025 స్ప్రింగ్​లో ప్రారంభమవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం