EPFO news: యూఏఎన్ విషయంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక అప్ డేట్; రేపే లాస్ట్ డేట్..-planning to switch your job epfo has an important message for you ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epfo News: యూఏఎన్ విషయంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక అప్ డేట్; రేపే లాస్ట్ డేట్..

EPFO news: యూఏఎన్ విషయంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక అప్ డేట్; రేపే లాస్ట్ డేట్..

Sudarshan V HT Telugu
Nov 29, 2024 06:01 PM IST

EPFO news: చందాదారులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఒక అత్యవసర సందేశాన్ని వెలువరించింది. ఉద్యోగులు తమ యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకోవడానికి ఆఖరు తేదీ నవంబర్ 30 అని స్పష్టం చేసింది. ఉద్యోగులు తమ యూఏఎన్ యాక్టివ్ గా ఉందో లేదో ఈపీఎఫ్ పోర్టల్ లో చెక్ చేసుకోవచ్చు.

యూఏఎన్ విషయంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక అప్ డేట్
యూఏఎన్ విషయంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక అప్ డేట్

EPFO news: మీరు మీ ఉద్యోగాన్ని మార్చే ప్రక్రియలో ఉంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మీ కోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. ఉద్యోగం మారే సమయంలో కొత్త యూఏఎన్ (Universal Account Number) కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు తెలిపింది. ఎందుకంటే ఒక సభ్యుడికి ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ ఉండకూడదు.

ఒక ఉద్యోగికి ఒకే యూఏఎన్

‘‘ఉద్యోగులు తమ పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మళ్లీ కొత్త యూఏఎన్ ను సృష్టించాల్సిన అవసరం లేదు. ఒక సభ్యుడికి ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ లు ఉండకూడదు. నిరుద్యోగం, ఉద్యోగ మార్పు వంటి సందర్భాల్లో కొత్తగా యూఏఎన్ అవసరం లేదు’’ అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. యూఏఎన్, లేదా సార్వత్రిక ఖాతా సంఖ్య, ఉద్యోగి యొక్క ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లను గుర్తించే 12 అంకెల సంఖ్య. ఆ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు మారినా యూఏఎన్ మారదు. అది స్థిరంగా ఉంటుంది.

యూఏఎన్ యాక్టివేషన్

ఈపీఎఫ్ఓ (employee provident fund) ప్రచారం చేస్తున్న మరో ముఖ్యమైన విషయం యూఏఎన్ యాక్టివేషన్. ఆధార్ ఆధారిత యూఏఎన్ యాక్టివేషన్ కు చివరి తేదీ నవంబర్ 30 అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ‘‘పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్, మరీ ముఖ్యంగా ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి ఈపీఎఫ్ఓ సేవలను ఆస్వాదించడానికి మీ యూఏఎన్ ను యాక్టివేట్ చేయడం చాలా ముఖ్యం’’ అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.

యూఏఎన్ ను ఇలా యాక్టివేట్ చేయండి

ఆధార్ ఆధారిత యూఏఎన్ (UAN) యాక్టివేషన్ కోసం, మీరు ఈ కింద పేర్కొన్న దశలను అనుసరించాలి.

  • స్టెప్ 1: ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ను సందర్శించండి.
  • స్టెప్ 2. ముఖ్యమైన లింక్ ల కింద ఉన్న ‘యూఏఎన్ యాక్టివేట్’ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3. యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ లను ఎంటర్ చేయండి.
  • స్టెప్ 4. ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అంతకుముందు, మీ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉందో, లేదో చూసుకోండి.
  • స్టెప్ 5. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కు అంగీకరించండి.
  • స్టెప్ 6. ఆధార్ లింక్ చేసిన మీ మొబైల్ కు ఓటీపీ రావడానికి ఆథరైజేషన్ పిన్ పొందండి.
  • స్టెప్ 7. యాక్టివేషన్ పూర్తి చేయడం కొరకు OTPని నమోదు చేయండి.

కొత్తగా చేరిన ఉద్యోగులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన ఉద్యోగులందరికీ ఆధార్ (aadhaar) ఆధారిత ఓటిపి ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను ఆయా యాజమాన్యాలు 30 నవంబర్ 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ వద్ద పనిచేసే ఉద్యోగులందరికీ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. యూఏఎన్ యాక్టివేషన్ ద్వారా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ (EPFO) సమగ్ర ఆన్ లైన్ సేవలను అంతరాయం లేకుండా పొందవచ్చు. ఇది వారి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడానికి, పిఎఫ్ పాస్ బుక్ లను వీక్షించడానికి మరియు డౌన్లోడ్ చేయడానికి, ఉపసంహరణలు, అడ్వాన్స్లు లేదా బదిలీల కోసం ఆన్ లైన్ క్లెయిమ్ లను సమర్పించడానికి, వ్యక్తిగత వివరాలను అప్ డేట్ చేయడానికి, రియల్ టైమ్ లో క్లెయిమ్ లను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

Whats_app_banner