Margashira Amavasya: నేడే మార్గశిర అమావాస్య తిథి, ప్రాముఖ్యతతో పాటు ఈరోజు ఏమేం చేయాలో తెలుసుకుందాం
Margashira Amavasya: మార్గశిర అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. దేవతలు, పూర్వీకుల ఆశీస్సులతో పాటు అదృష్టం వరించాలంటే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని 15వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి నేడు రేపు అంటే నవంబరు 30, డిసెంబర్ 1 తేదీలలో మార్గశిర అమావాస్య తిథి వచ్చింది. ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడం, శ్రాద్ధ కర్మ, పితృ తర్పణం చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో పవిత్రం కార్యాలుగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున, పితృ దోష నివారణం కోసం అనేక పనులు కూడా చేస్తారు. మార్గశిర అమావాస్య రోజున చంద్ర దేవుని ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఈ రోజున చంద్రుడిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికల నెరవేరుతుందని, జీవితంలో ఆనందం, శాంతి, ఆనందం లభిస్తుందని నమ్మిక. అయితే మార్గశిర్ష అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర్ష అమావాస్య రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య అమావాస్య తిథి 30 నవంబర్ 2024న ఉదయం 10:29 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి 1 డిసెంబర్ 2024 ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. అంటే 1 డిసెంబర్ 2024న మార్గశిర అమావాస్య పండుగను జరుపుకోవాలి.
మార్గశిర అమావాస్య ప్రాముఖ్యత ఏంటి?
హిందూ పురాణాలు మార్గశిర అమావాస్య గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున భక్తులు తమ జీవితంలోని ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు రకరకాల పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం తిలా తర్పణం, పిండ దానం, పితృ పూజ వంటి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులను దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. అలాగే మార్గశిర అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని హిందువులు నమ్ముతారు.
మార్గశిర అమావాస్య రోజు చేయవలసిన పనులేంటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మార్గశిర అమావాస్య రోజు శని పూజ చేయడం వల్ల శనిగ్రహం వల్ల వ్యక్తిపై పడే ప్రతికూల ప్రభావాలు, బాధలు తగ్గుతాయి. ఈ రోజు శనిపూజ చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్మిక.అలాగే ఈ రోజు ఆది దేవుడైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల దైవానుగ్రహం తప్పక లభిస్తుందంటారు.మార్గశిర అమావాస్య తిథి రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు, ఆత్మ శుద్ధి అయి సానుకూల శక్తులకు నిలయంగా మారతాయి.ముఖ్యంగా ఈ రోజు ఉపవాస దీక్ష చేపట్టే భక్తులు తప్పనిసరిగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు, దోషాలు తొలగిపోయి శాంతి, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం వంటి అన్ని విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి.ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రావిచెట్టును పూజించాలి.మార్గశిర్ష అమావాస్య రోజున సత్యనారాయణుని కథ వినడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు దుప్పట్లు, బూట్లు, చెప్పులు, బెల్లం, నెయ్యి, నువ్వులు, ఎండు కలప, దుప్పట్లు, వెచ్చని బట్టలు, నువ్వులు, స్వీట్లు, నల్ల బట్టలు, బంగారం, పప్పులు, భూమి, పిండి, పండ్లు, ఉసిరి, పంచదార మొదలైనవి దానం చేయవచ్చు.
మార్గశిర అమావాస్య రోజున ఏం చేయకూడదు?
ఈ రోజున మాంసం, మద్యపానం, ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారం వంటి తామసిర ఆహారాలు తినకూడదు. మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇంటి పెద్దలను కించపరచవద్దు, అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. ఇల్లు కొనడం, కొత్త కారు కొనడం వంటి శుభకార్యాలు చేయడం మానుకోవాలి.మార్గశిర అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం నిషిద్ధం. నల్లని వస్త్రం రాహువుకు చిహ్నం. అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు.అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదని నమ్ముతారు. అలా చేయడం అశుభంగా భావిస్తారు.