తెలుగు న్యూస్ / ఫోటో /
Hair fall problem: చలి కాలంలో జుట్టు ఊడే సమస్యకు కారణాలివే..
Hair fall problem: చలికాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందులోనూ, చర్మ, జుట్టు సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఈ సీజన్ లో జుట్టు ఊడకుండా, పొడిబారకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలే సమస్య రాకుండా ఈ టిప్స్ పాటించండి.
(1 / 5)
చలి కాలంలో జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. తలను తాకితే చేతికి వెంట్రుకలు వస్తాయి. శీతాకాలంలో పొడి జుట్టు, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా?(pixabay)
(2 / 5)
చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఈ వేడి నీటితో తల స్నానం చేసే అలవాటు వల్ల మీ జుట్టు గరుకుగా మారుతుంది.ఎందుకంటే వేడి నీరు జుట్టు నుండి మొత్తం నూనెను గ్రహించేస్తుంది. సహజంగా జుట్టు యొక్క మెరుపు తగ్గుతుంది.. జుట్టు రాలుతుంది.(pixabay)
(3 / 5)
చలికాలంలో స్నానం చేసిన తర్వాత జుట్టు పొడిగా మారడానికి చాలా సమయం పడుతుంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో ఉన్నవారు ఉదయమే బయటకు వెళ్లే వారికి జుట్టును ఆరబెట్టడానికి, సరైన జుట్టు నిర్వహణకు సమయం దొరకదు.(pixabay)
(4 / 5)
రెగ్యులర్ హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగించడం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.అంతేకాదు హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా స్కాల్ప్ కూడా పొడిబారుతుంది. అంతేకాకుండా ప్రతిరోజూ హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్య పెరుగుతుంది.(pixabay)
ఇతర గ్యాలరీలు