విజయవాడ పటమటలో ఉన్న నల్లూరి వారి ధర్మతోటలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి 20ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. దాతల ఆశయాలకు విరుద్ధంగా స్వామి సొమ్మును ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వారి చెర నుంచి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.మంత్రి లోకేష్ చొరవతో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది.