Karthika Amavasya: కార్తీక అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం-find out which items should be donated by which zodiac signs on karthika amavasya 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Amavasya: కార్తీక అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం

Karthika Amavasya: కార్తీక అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం

Ramya Sri Marka HT Telugu
Nov 30, 2024 07:47 AM IST

కార్తీక అమావాస్య పవిత్ర స్నానాలకు, పితృ దోష నివారణానికు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి రాశిచక్రాన్ని బట్టి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయాలి.

కార్తీక అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలి
కార్తీక అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలి

కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథికి పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పవిత్ర స్నానాలకు చాలా పవిత్రమైదిగా భావిస్తారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అమావాస్య పర్వదినాన పితృదేవతలకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రాద్ధం, తర్పణం, పిండదానం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వంశపారంపర్య దోషాల నివారణకు కూడా ఈరోజు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇది జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుందని చెబుతారు. కార్తీక్ష అమావాస్య రోజున విష్ణువును, భోలేనాథుడిని పూజిస్తారు. అమావాస్య రోజును దానధర్మాలు చేయడం కూడా చాలా మంచిదని విశ్వసిస్తారు. ఈ రోజున, మీరు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి రాశిచక్రం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

కార్తీక అమావాస్య తిథి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక అమావాస్య అమావాస్య తిథి 30 నవంబర్ 2024న ఉదయం 9:37 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి 1 డిసెంబర్ 2024 ఉదయం 10:11 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకోవాలి. అంటే 1 డిసెంబర్ 2024న కార్తీక అమావాస్య పండుగను జరుపుకోవాలి.

కార్తీక అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలి:

మేష రాశి :

మేష రాశి వారు వేరుశెనగ, కిడ్నీ బీన్స్, రాగి పిండి, బెల్లం దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారు పాలు, పెరుగు, వెన్న వంటి పాల ఉత్పత్తులను దానం చేస్తే మంచి జరుగుతుంది.

మిథునం రాశి:

మిథున రాశి వారు ఆకుపచ్చ కూరగాయలు, పెసరపప్పు లేదా ఆకుపచ్చ పండ్లు వంటి ఆకుపచ్చ వస్తువులను దానం చేయవచ్చు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు కార్తీక్ష అమావాస్య రోజున గోధుమ పిండి, ఉప్పు, పంచదార, బియ్యం లేదా పిండిని దానం చేయాలి.

సింహ రాశి:

ఈ రోజు సింహ రాశి వారు పప్పులు, రాగి పిండి, ఎండు మిరపకాయలు, గోధుమ పిండి దానం చేయవచ్చు.

కన్య రాశి:

కన్యా రాశి వారు తమ శక్తి మేరకు ధన దానం లేదా పెసరపప్పు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

తులా రాశి:

తులారాశి వారు కార్తీక్ష అమావాస్య రోజున ఉప్పు, గోధుమ పిండి, పిండి మొదలైన వాటిని దానం చేయవచ్చు.

వృశ్చిక రాశి:

ఈ రోజు వృశ్చిక రాశి వారు రాగులు, పప్పు లేదా చిలగడదుంపలను దానం చేయవచ్చు.

ధనుస్సు రాశి:

కార్తీక్ష అమావాస్య రోజున ధనుస్సు రాశి వారు పచ్చి అరటిపండు, బొప్పాయి, శనగపిండి, పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు.

మకర రాశి:

మకర రాశి జాతకులు నలుపు రంగు నువ్వులు, నల్ల ఆవాలు లేదా లిన్ సీడ్ వంటి నలుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు తోలు, నలుపు బట్టలు లేదా నల్ల దుప్పట్లతో చేసిన బూట్లు, చెప్పులను దానం చేయడం శుభదాయకం.

మీన రాశి:

మీన రాశి వారు శనగలు, సత్తు లేదా పచ్చి అరటిపండు దానం చేయవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner