Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.11.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 29-11-2024
సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం, అయనము: దక్షిణాయనం,
మాసం: కార్తీకము, తిథి: బ.త్రయోదశి, వారం: శుక్రవారం, నక్షత్రం: స్వాతి
మేషం:
అనవసర ఖర్చులు పెడతారు. పొదుపు పాటించండి. శుభకార్య యత్నాలు చేపడతారు. మొహమాటంతో సమస్యలు ఎదుర్కొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కలసివచ్చే రోజు. ఆందోళనలకు దూరంగా ఉండండి.
వృషభం:
ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు తలెత్తవచ్చు.
మిథునం:
శ్రమానంతర ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఓర్పుతో వ్యవహరించండి.
కర్కాటకం:
ఆచితూచి అడుగేయండి. తొందరపాటు చర్యలు వద్దు. వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఘర్షణలకు తావు ఇవ్వవద్దు.
సింహం:
మీ ప్రతిభతో సమస్యలను పరిష్కరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు.
కన్య:
ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అంతా కలసివస్తుంది. రాబడి బాగుంటుంది. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో వ్యవహరించండి. శుభకార్య యత్నాలు చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల:
అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. శుభసమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే యోచన చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. పనిపై దృష్టి పెట్టండి. అశ్రద్ధ వద్దు. ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృశ్చికం:
ఆర్థికంగా బాగుంటుంది. అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. నోరు అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. భాగస్వాములతో గొడవలొద్దు.
ధనుస్సు:
స్వగృహంకోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరూ కలసివస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కళాకారులకు, రాజకీయనాయకులకు కలసివస్తుంది.
మకరం:
కొత్తప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు చర్యలు చేపట్టండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఈరోజు ఆనందంగా గడుపుతారు. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. తొందరపాటుగా వ్యవహరించవద్దు.
కుంభం:
ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. ఆర్థికపరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మీకు గుర్తింపు లభిస్తుంది.
మీనం:
ఆర్థికంగా అంత బాగా ఉండదు. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సమస్యలు తలెత్తుతాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. ఘర్షణలకు దూరంగా ఉండండి. వివాదాల్లో తలదూర్చవద్దు. పనిపై శ్రద్ధ చూపండి.