(1 / 7)
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
(2 / 7)
దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం,మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
(3 / 7)
దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
(4 / 7)
“లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(5 / 7)
(6 / 7)
(7 / 7)
ఇతర గ్యాలరీలు