NaaNaa Hyranaa Song Lyrics: గేమ్ ఛేంజర్ నానా హైరానా సాంగ్ లిరిక్స్ - రామ్‌చరణ్, కియారా కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్!
Game Changer Song: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూడో సింగిల్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. నానా హైరానా అంటూ రొమాంటిక్ మేలోడీగా సాగిన ఈ సాట్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి మూడో సింగిల్ వచ్చేసింది. నానా హైరానా అనే రొమాంటిక్ సింగిల్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్యశాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌశర్ మునీర్ రాశారు. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. తమిళంలో ‘లై రానా’ అనే పల్లవితో ఈ పాట సాగింది.
శ్రేయా ఘోషల్...కార్తీక్...
నానా హైరానా పాటను శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. శంకర్ సినిమాల్లో మాదిరిగానే కలర్‌ఫుల్ విజువల్స్, బ్యూటీఫుల్ లోకేషన్స్‌తో గ్రాండియర్‌గా పాటను చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. ఈ పాటలో రామ్‌చరణ్, కియారా అద్వానీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
న్యూజిలాండ్‌లో...
న్యూజిలాండ్‌లో ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో షూట్ చేశారు. విజువల్ ట్రీట్‌గా ఈ పాట కనిపించబోతున్నది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీ (వెస్ట్రన్, కర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బర్న్ట్ టోన్స్‌ను ఉపయోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాటలో ఉపయోగించారు. నానా హైరానా పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ అందించారు.
నెక్స్ట్ రేంజ్...
ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి జరగండి’... ‘రా మచ్చా రా.. ’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
ఇటీవలే పూణేలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్‌ను ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త క్యారెక్టర్‌లో ఈ మూవీలో కనిపించబోతున్నట్లు టీజర్‌లో ద్వారా డైరెక్టర్ శంకర్ హింట్ ఇచ్చారు. ఇందులో చరణ్ పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా, సమాజానికి సేవ చేయాలనుకునే యువకుడిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినివ్వడం ఖాయమని మేకర్స్ చెబుతోన్నారు.
ఎస్‌జే సూర్య, సముద్రఖని...
రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ గేమ్ ఛేంజర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. .
ప్రీ రిలీజ్ ఈవెంట్...
‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ ఛేంజర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా డిసెంబర్ 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
నానా హైరానా పాట లిరిక్స్ ఇవిగో...
నానా హైరానా ప్రియమైనా హైరానా
మొదలయ్యే నాలోనా లలనా నీవలనా
నానా హైరానా అరుదైన హైరానా
నెమలీకలా పులకింతై నా చెంపలు నిమిరేనా
ధనాధీనా ఈవేళ నీలోన నాలోనా
కనివినని కలవరమే సుమశరమా
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..
ఎప్పుడు లేనే లేని వింతలు ఇప్పుడే చూస్తున్న
గగనాలన్నీ పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై కనువిందాయాను పావనములు
ఎవరు లేనే-లేని ధీవులు నీకు నాకేనా
రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయ్యె
తనువెలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలికథగా….
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..