Naga Chaitanya Sobhita: శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్-naga chaitanya sobhita dhulipala wedding chaitanya talks about sobhita and her family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Sobhita: శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్

Naga Chaitanya Sobhita: శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్

Hari Prasad S HT Telugu
Nov 28, 2024 05:01 PM IST

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య తన కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల, ఆమె ఫ్యామిలీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరి పెళ్లి డిసెంబర్ 4న జరగనున్న నేపథ్యంలో జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడాడు.

శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్
శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. వీళ్ల పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జూమ్ ఇంటర్వ్యూలో తన కాబోయే భార్య, ఆమె కుటుంబంపై చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శోభితను తొలిసారి కలిసింది అక్కడే

ఈ ఇంటర్వ్యూలో శోభితను తాను తొలిసారి ఎక్కడ కలిశానో నాగ చైతన్య వెల్లడించాడు. "నా ఓటీటీ షో లాంచ్ కోసం నేను ముంబై వెళ్లాను. అదే సమయంలో అదే ప్లాట్‌ఫామ్ తో ఆమె కూడా ఓ షో చేస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసిన షోలోనే మేమిద్దరం తొలిసారి కలిసి మాట్లాడుకున్నాం" అని చైతూ వెల్లడించాడు. అంతేకాదు శోభిత కుటుంబంపై కూడా అతడు ప్రశంసలు కురిపించాడు.

కొడుకులా చూసుకున్నారు

శోభిత కుటుంబం తనను కొడుకులా చూసుకుందని ఈ సందర్భంగా అతడు తెలిపాడు. "కొన్ని నెలలుగా శోభిత, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపిస్తోంది. రెండు కుటుంబాలు మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. పెళ్లి రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

నన్ను ఓ కొడుకులా చూసుకున్నారు. చాలా సౌకర్యంగా ఫీలయ్యాను. చాలా విషయాలు రెండు కుటుంబాల్లోనూ కామన్ గా ఉన్నాయి. శోభితా ఓ ఫ్యామిలీ గర్ల్. మేమందరం కొన్ని పండగలు కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం" అని చైతన్య చెప్పుకొచ్చాడు.

అతిథులు తక్కువే..

ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా చైతన్య మాట్లాడాడు. సాంప్రదాయాల పరంగా ఈ పెళ్లి చాలా ఘనంగా జరగబోతున్నా.. అతిథులు మాత్రం చాలా తక్కువే అని స్పష్టం చేశాడు. ఇక పెళ్లి వేదిక అయిన అన్నపూర్ణ స్టూడియోస్ కు తమ కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉందని కూడా చైతన్య చెప్పాడు. "పెళ్లి ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి.

ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. సాంప్రదాయాలు పాటించే పరంగా పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అతిథుల సంఖ్య తక్కువగానే ఉంటుంది" అని చైతన్య స్పష్టం చేశాడు. ఇక తమ పెళ్లి ఫుటేజీని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు అమ్ముకున్నట్లు వస్తున్న వార్తలను చైతన్య ఖండించాడు. అవన్నీ తప్పుడు వార్తలని, అలాంటి డీల్ ఏదీ జరగలేదని చెప్పాడు.

Whats_app_banner