Relationships: ప్రతి భార్య తన భర్తకు తెలియకుండా దాచే అయిదు విషయాలు ఇవే
తెలిస్తే మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు, కానీ మహిళలు తమ భర్తలతో పంచుకోవడానికి సంకోచించే కొన్ని విషయాలు ఉన్నాయి. వీటి వెనుక ఉన్న కారణం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.
ఈ ప్రపంచంలోని అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకం. పెళ్లయిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒక్కరు. వీరి బంధం ప్రేమ, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. వీరి బంధంలో అబద్ధాలు, మోసానికి చోటు లేదు. ఇద్దరూ తమ విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. రహస్యాలు లేకుండా జీవించాలి. అయితే భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలను దాస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. భార్యలు తమ భర్తలతో ఎన్నో విషయాలను పంచుకుంటున్నప్పటికీ, పంచుకోని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది . దీని వెనుక కొన్ని సరైన కారణాలు ఉన్నాయి. కాబట్టి భార్యలు తమ భర్తలతో కూడా పంచుకోలేని ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
ఎందుకు దాచి పెడతారు?
తన భర్తను, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొంతమంది మహిళలు కొన్ని విషయాలను దాచి పెడతారు. ఇంట్లో వారికి ఇబ్బంది కలగకూడదనే తన సమస్యలను ఆమె దాచి పెడుతుంది. ముఖ్యంగా తగిలిన గాయాలు, జననేంద్రియాలలో ఏవైనా సమస్యలు, ఒత్తిడి లేదా డిప్రెషన్ తో పోరాడటం, మానసిక సమస్యలు వంటివి ఆమె తన భర్తతో పంచుకోవడానికి ఆలోచిస్తుంది. చాలా మంది భార్యలు ఈ విషయాలు భర్త దగ్గర దాచి పెడతారు.
చిన్న పొదుపు
ఇంట్లోని మహిళలు తరచుగా చిన్న పొదుపు గురించి కొంత డబ్బును దాచిపెడతారు. ప్రతి నెలా చేసే ఈ పొదుపు గురించి ఆమె తన భర్తకు చెప్పదు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. కుటుంబాన్ని కాపాడేందుకే మహిళల ఇలా పొదుపు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు భర్త దగ్గర ప్రస్తావించారు.
లైంగిక కోరికలు
మహిళలు తమ లైంగిక ఇష్టాయిష్టాల గురించి తమ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. పురుషుల మాదిరిగానే, మహిళలకు కూడా లైంగిక ఫాంటసీలు ఉంటాయి, కానీ వారు దాని గురించి వారి భర్తలతో మాట్లాడటాన్ని దాచి ఉంచుతారు. అలాంటి విషయాలు చెబితే తన భర్త ఏమంటాడో అన్న భయం వారికి ఉంటుంది. ఆమె సాధారణంగా తన భర్త ఇష్టాయిష్టాలనే తన ఇష్టాయిష్టాలుగా చెబుతుంది.
ఈరోజుల్లో పెళ్లికి ముందు జరిగే సంభాషణలో భార్యాభర్తలిద్దరూ తమ గతం గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటారు. కానీ కొన్నిసార్లు మహిళలు తమ పాత బంధాల గురించి షేర్ చేసుకోదు. ఇలాంటి విషయాలు తెలిస్తే భవిష్యత్తులో భర్త నుంచి సమస్యలు వస్తాయేమో అని ఆమె భయం. అందుకే భర్త తన పాత బంధాల గురించి చెప్పినా ఈమె మాత్రం చెప్పదు.
స్త్రీలు తమ పుట్టింటి సమస్యలు, డబ్బు విషయాలు వంటివి భర్తతో పంచుకోవడానికి సంకోచిస్తారు. వాటిని భర్త తరుపు బంధువులు తక్కువ చేసి మాట్లాడుతారేమోనని ఆమె ఆలోచిస్తుంది. భార్యకు తన భర్త బంధువులతో కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ తన భర్త తన గురించి ప్రతికూల ఆలోచనలు చేస్తాడని భావించి ఆమె తన భర్తకు పుట్టింటి విషయాలు చెప్పదు. అలాగే పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను కూడా ఆమె దాచి పెడుతుంది.
టాపిక్