UPSC Mains Result 2024: యూపీఎస్సీ మెయిన్స్ మార్కుల వెల్లడి; మీ మార్క్స్ ను ఇలా చెక్ చేసుకోండి..-upsc ese mains result 2024 marks out at upsc gov in direct link to check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Upsc Mains Result 2024: యూపీఎస్సీ మెయిన్స్ మార్కుల వెల్లడి; మీ మార్క్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

UPSC Mains Result 2024: యూపీఎస్సీ మెయిన్స్ మార్కుల వెల్లడి; మీ మార్క్స్ ను ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Nov 28, 2024 06:10 PM IST

UPSC Mains Result 2024: యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్ 2024 రాసిన అభ్యర్థుల మార్కులను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్ 2024 మార్క్స్ ను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ద్వారా చెక్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ మెయిన్స్ మార్కుల వెల్లడి
యూపీఎస్సీ మెయిన్స్ మార్కుల వెల్లడి

UPSC ESE Mains Result 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్ 2024 రాసిన అబ్యర్థుల మార్కులను గురువారం విడుదల చేసింది. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్, 2024కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.

రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..

యూపీఎస్సీ (UPSC) ఈఎస్ఈ 2024 మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ ను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయండి.
  • హోం పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్ రిజల్ట్ 2024 మార్క్స్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న పీడీఎఫ్ ఫైల్ పై అభ్యర్థులు క్లిక్ చేయాలి.
  • పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రోల్ నంబర్ ఆధారంగా మార్కులను చెక్ చేసుకోవచ్చు.
  • అనంతరం, ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

మొత్తం 206 మంది అభ్యర్థులు

యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్ ఫలితాలు 2024 నవంబర్ 23న విడుదలయ్యాయి. మొత్తం 206 మంది అభ్యర్థుల నియామకానికి సిఫార్సు చేయగా, వారిలో 92 సివిల్ ఇంజనీరింగ్, 18 మెకానికల్ ఇంజనీరింగ్, 26 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 70 మంది ఇ అండ్ టి ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నారు. ఎంపికైన వారిలో జనరల్ కేటగిరీలో అత్యధికంగా 71 మంది, ఓబీసీల్లో 59 మంది, ఎస్సీల్లో 34 మంది, ఈడబ్ల్యూఎస్ లో 22 మంది, ఎస్టీల్లో 20 మంది ఉన్నారు.

టాపర్ రోహిత్ ధోండ్గే

యూపీఎస్సీ ఈఎస్ఈ 2024 మెయిన్ లో ఉత్తీర్ణత సాధించిన వారిలో రోహిత్ ధోండ్గే మొదటి స్థానంలో నిలవగా, హర్షిత్ పాండే, లక్ష్మీకాంత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష జూన్ 2024లో జరిగింది, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అక్టోబర్ 7, 8, 9, 10, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 25, నవంబర్ 4, 5, 6 తేదీల్లో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండో షిఫ్టు చొప్పున రెండు షిఫ్టుల్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ రిక్రూట్ మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలో 251 ఖాళీలను భర్తీ చేయనుంది.

Whats_app_banner