IBPS RRB PO Mains Result 2024 : ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి-ibps rrb po mains result 2024 out download link for officer result status here know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Rrb Po Mains Result 2024 : ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి

IBPS RRB PO Mains Result 2024 : ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి

Anand Sai HT Telugu
Nov 04, 2024 02:57 PM IST

IBPS RRB PO Mains Result Out : ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఫలితాలను చూసుకోవచ్చు. ఇందుకోసం కింద చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి.

ఐబీపీఎస్ ఫలితాలు
ఐబీపీఎస్ ఫలితాలు (Unsplash)

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఫలితాలు 2024ను విడుదల చేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. నవంబర్ 4 2024న పరీక్షల ఫలితాల స్థితిని అధికారికంగా విడుదల చేశారు. ఏటా నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా భారతదేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBs)లో పోస్టులను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

అభ్యర్థులు అధికారిక ibps.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ I కోసం CRP-RRB-XIII ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ పరీక్షలో సాధారణంగా ఆఫీసర్ స్కేల్-I పాత్రను కావాలనే అభ్యర్థులకు నిర్వహించారు. దీనిని ఆర్ఆర్‌బీలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) అని కూడా పిలుస్తారు.

ఆఫీసర్ స్కేల్ II కోసం CRP-RRB-XIII ఆన్‌లైన్ సింగిల్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ఒకే పరీక్ష స్కేల్-II పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం నిర్వహించారు. అనుభవజ్ఞులైన బ్యాంకింగ్ నిపుణులు ఇందులో ఉంటారు.

ఆఫీసర్ స్కేల్-III కోసం CRP-RRB-XIII ఆన్‌లైన్ సింగిల్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ పరీక్ష ఆర్ఆర్‌బీలలో ఎక్కువ సీనియర్ ఆఫీసర్స్ కోసం. స్కేల్-III అధికారులు సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక సంవత్సరాల అనుభవం కలిగి ఉంటారు.

అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

IBPS అధికారిక వెబ్‌సైట్, ibps.inకి వెళ్లండి.

హోమ్‌పేజీలో, “CRP-RRBs-XIII ఆఫీసర్ల కోసం ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితాల లింక్‌ను చూడండి.

మీ పరీక్ష రకాన్ని ఎంచుకోండి. హాజరైన పరీక్షను బట్టి ఆఫీసర్ స్కేల్ I, II లేదా III కోసం సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.

లాగిన్ వివరాలను నమోదు చేయండి. ఇందుకోసం మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి.

మీ ఫలిత స్థితిని చూసిన తర్వాత, భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

ఈ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు చివరి ఇంటర్వ్యూ రౌండ్‌కు వెళతారు. ఇంటర్వ్యూ అనేది ఆర్ఆర్‌బీలో ఆఫీసర్ పోస్టులకు తుది ఎంపికను నిర్ణయించే ముఖ్యమైన రౌండ్. మరింత సమాచారం కోసం, ibps.inని సందర్శించండి.

Whats_app_banner