IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్స్ రిజర్వ్ లిస్ట్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..-ibps rrb result 2024 po and clerk reserve list out at ibps in direct links here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ibps Rrb Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్స్ రిజర్వ్ లిస్ట్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్స్ రిజర్వ్ లిస్ట్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 కి సంబంధించి పీవో, క్లర్క్ రిజర్వ్ జాబితా ను ఐబీపీఎస్ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్స్ రిజర్వ్ లిస్ట్ విడుదల

IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్ 2024లో పీవో, క్లర్క్ పోస్టుల రిజర్వ్ జాబితాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (rrb) ల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్ చేపట్టారు. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్లకు సంబంధించిన రిజర్వ్ జాబితాను విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్ 1 కింద తాత్కాలికంగా కేటాయించిన అభ్యర్థుల జాబితాను ఈ క్రింది సరళమైన దశలను అనుసరించడం ద్వారా చెక్ చేయవచ్చు.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 రిజర్వ్ లిస్ట్

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 ఫలితాలను ఈ కింది స్టెప్స్ ద్వారా చెక్ చేసుకోండి.

  • ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్ 2024 రిజర్వ్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • అది పూర్తయిన తర్వాత రిజర్వ్ లిస్ట్ డిస్ ప్లే అవుతుంది.
  • జాబితాను తనిఖీ చేయండి. దానిని డౌన్లోడ్ చేయండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

అక్టోబర్ లో ఒక లిస్ట్

తాత్కాలిక కేటాయింపు రిజర్వ్ జాబితాను గతంలో 2024 అక్టోబర్ 29న విడుదల చేశారు. అధికారిక నోటీసు ప్రకారం, అభ్యర్థుల లభ్యతకు లోబడి, ప్రతి కేటగిరీలో సంబంధిత ఆర్ఆర్బీలు వాస్తవంగా నివేదించిన ఖాళీలు, నిర్దిష్ట రాష్ట్రంలో ఉన్న పోస్టుల ఆధారంగా తాత్కాలిక కేటాయింపు కు సంబంధించిన రిజర్వ్ జాబితా ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.