Hyundai Tucson: భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ కు కూడా 5 స్టార్ రేటింగ్-hyundai tucson also scores 5 stars crash test rating in bharat ncap ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Tucson: భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ కు కూడా 5 స్టార్ రేటింగ్

Hyundai Tucson: భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ కు కూడా 5 స్టార్ రేటింగ్

Sudarshan V HT Telugu
Nov 28, 2024 08:04 PM IST

Hyundai Tucson crash test rating: భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ ఎస్ యూ వీ కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ పెద్దల రక్షణలో 30.84 పాయింట్లు, పిల్లల రక్షణలో 41 పాయింట్లు సాధించింది.

హ్యుందాయ్ టక్సన్ కు కూడా 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్
హ్యుందాయ్ టక్సన్ కు కూడా 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్

Hyundai Tucson crash test rating: భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ పర్ఫెక్ట్ 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత్ ఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ వాహనం ఇదే. ఇది పెద్దల రక్షణలో 32 కు 30.84 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49 కు 41 పాయింట్లు సాధించింది.

సెక్యూరిటీ ఫీచర్స్

హ్యుందాయ్ టక్సన్ కారులో ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్, బెల్ట్ ప్రీటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి. ఇందులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. హ్యుందాయ్ (hyundai cars) టక్సన్ ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లకు ఈ రేటింగ్స్ వర్తిస్తాయి.

డ్రైవర్, ప్రయాణికుల రక్షణకు

ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ 16.00 కు 14.84 స్కోరు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో ఇది 16 కు 16 స్కోరు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో డ్రైవర్ ఛాతీ, పాదం కోసం తగిన రక్షణ పొందాడు. అలాగే, కారులో ప్రయాణించే ఇతరుల అన్ని శరీర భాగాలకు మంచి రక్షణ రేటింగ్ లభించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ లో, కార్లో ఉన్నవారికి అన్ని ప్రాంతాలలో మంచి రక్షణ లభించింది. ఈ ఎస్యూవీ డైనమిక్ స్కోరు 24 లో 24, CRS ఇన్ స్టలేషన్ స్కోరు 12కు 12 కాగా, వెహికల్ అసెస్ మెంట్ స్కోర్ 13 లో 5 సాధించింది.

హ్యుందాయ్ టక్సన్ ధర ఎంత? టక్సన్

హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల మధ్య ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. హ్యుందాయ్ టక్సన్ ను 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 156 బిహెచ్ పి పవర్, 192ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ 186 బిహెచ్ పి పవర్, 416ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. అంతేకాకుండా, డీజిల్ ఇంజన్ కు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.

హ్యుందాయ్ టక్సన్ కలర్ ఆప్షన్లు

హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson) రెండు డ్యూయల్-టోన్ షేడ్స్, ఐదు మోనోటోన్ రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టార్రీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అబిస్ బ్లాక్ రూఫ్ తో ఫియరీ రెడ్.

Whats_app_banner