Hyundai Tucson facelift : ఇదిగో హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​..!-hyundai tucson facelift debuts with host of updates india launch likely in 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Tucson Facelift : ఇదిగో హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​..!

Hyundai Tucson facelift : ఇదిగో హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​..!

Sharath Chitturi HT Telugu
Nov 21, 2023 12:05 PM IST

Hyundai Tucson facelift : హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​ని సంస్థ రివీల్​ చేసింది. 2024లో ఈ మోడల్​ ఇండియాలో లాంచ్​ అవ్వనుంది.

ఇదిగో హ్యుందాయ్​ టుక్సన్​ ఫేస్​లిఫ్ట్​..!
ఇదిగో హ్యుందాయ్​ టుక్సన్​ ఫేస్​లిఫ్ట్​..!

Hyundai Tucson facelift : హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తాజాగా రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​లో స్వల్ప మార్పులు చేసింది. త్వరలోనే ఈ కొత్త ఎస్​యూవీ.. అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ టక్సన్​ ఎస్​యూవీ..

సౌత్​ కొరియా ఆటోమొబైల్​ సంస్థలు.. ఈ మధ్య కాలంలో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లపై దృష్టిపెట్టాయి. వాహనాలకు భారీ మార్పులు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​లో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనార్హం. ఎస్​యూవీ ఫ్రెంట్​ గ్రిల్​కి కొత్త డిజైన్​ వస్తోంది. పారామెటరిక్​ డైనమిక్​ డిజైన్​ లభిస్తోంది. హెడ్​ల్యాంప్​ క్లస్టర్​ని మార్చలేదు. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ని స్వల్పగా మార్చింది సంస్థ. కొత్తగా అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. బంపర్​- టెయిల్​లైట్స్​ని స్వల్పంగా రీ-డిజైన్​ చేసింది హ్యుందాయ్​.

ఇక ఈ హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​ కేబిన్​లో 3 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ని రివైజ్​ చేసింది సంస్థ. డాష్​బోర్డ్​ కూడా ట్రెడీషనల్​గా మారింది. ఇందులో 12.3 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి. స్విచ్​గేర్​తో పాటు ఏసీ వెంట్స్​ని కూడా రీడిజైన్​ చేసింది. వయర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జింగ్​ డాక్​ కొత్తగా వస్తోంది. సెంటర్​ కన్సోల్​లో 2 కప్​ హోల్డర్స్​ వస్తున్నాయి.

ఇదీ చూడండి:- Hyundai EXTER : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్​!

Hyundai Tucson facelift India : ఈ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​కు సంబంధించిన ఇంజిన్​ వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడున్న మోడల్​లోని ఇంజిన్​నే.. కొత్త వర్షెన్​ని కూడా వాడే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

హ్యుందాయ్​ టక్సన్​ ఫేస్​లిఫ్ట్​ ధర ఎంత ఉంటుంది?

Hyundai Tucson facelift price : హ్యుందాయ్​ టక్సన్​ కొత్త వర్షెన్​ లాంచ్​ డేట్​పై క్లారిటీ లేదు. ధరకు సంబంధించిన వివరాలను కూడా సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. హైదరాబాద్​లో ఈ హ్యుందాయ్​ టక్సన్​​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 29.02లక్షలుగా ఉంది. అప్డేటెడ్​ వర్షెన్​ ధర ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం