Hyundai EXTER : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్​!-hyundai exter hits 1 lakh unit booking milestone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్​!

Hyundai EXTER : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్​!

Sharath Chitturi HT Telugu
Nov 20, 2023 02:50 PM IST

Hyundai EXTER : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ హవా కొనసాగుతోంది. లాంచ్​ అయిన నాలుగు నెలలకే.. 1లక్ష బుకింగ్స్​ మైలురాయిని తాకింది ఈ ఎస్​యూవీ.

1 లక్ష బుకింగ్స్​తో సరికొత్త మైలురాయిని తాకిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​!
1 లక్ష బుకింగ్స్​తో సరికొత్త మైలురాయిని తాకిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​!

Hyundai EXTER milestone : హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు బీభత్సమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్​యూవీ.. ఓ కొత్త మైలురాయిని తాకింది. లాంచ్​ అయిన నాలుగు నెలల్లోనే.. 1లక్ష బుకింగ్స్​ని సంపాదించుకుంది ఈ ఎస్​యూవీ! బడ్జెట్​ ఫ్రెండ్లీ ధరకే క్రేజీ ఫీచర్స్​ వస్తుండటం, డిజైన్​ కూడా హిట్​ అవ్వడంతో.. భారతీయులు ఈ మోడల్​పై విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ విశేషాలు..

ఇండియాలో.. 2023 జులైలో లాంచ్​ అయ్యింది ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ. ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.5లక్షల మధ్యలో ఉంటుంది. ఈ మోడల్​లో 7 వేరియంట్లు ఉన్నాయి. అంటే.. హ్యాచ్​బ్యాక్​ ధరకే దాదపు అన్ని ఫీచర్స్​తో కూడిన కాంపాక్ట్​ ఎస్​యూవీని ఆఫర్​ చేస్తోంది హ్యుందాయ్​. ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Hyundai EXTER on road price Hyderabad : మరీ ముఖ్యంగా.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ హై- ఎండ్​ మోడల్స్​లో క్రేజీ ఫీచర్స్​ వస్తున్నాయి. 6 ఎయిర్​బ్యాగ్స్​, డ్యూయెల్​ వ్యూ- డాష్​ కెమెరా, స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటివి ఈ కారు సొంతం.

ఈ ఎస్​యూవీలో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 82 హెచ్​పీ పవర్​ని, 95 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మన్యువల్​, 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ ఎక్స్​టర్​ మైలేజ్​ 19.2 కేఎంపీఎల్​గా ఉండటం విశేషం.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Hyundai EXTER price Hyderabad : ఈ 5 సీటర్​ మైక్రో ఎస్​యూవీ కేబిన్​లో సెమీ లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, ఎక్స్​టర్​ లెటర్స్​ ఉండే హెడ్​రెస్ట్​లు, 3 స్పోక్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తున్నాయి. డాష్​కామ్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే, 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఈ వెహికిల్​లో వస్తున్నాయి. స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాయిస్​ అసిస్ట్​తో ఈ ఫీచర్​ పనిచేస్తుండటం హైలైట్​!

డిమాండ్​కు తగ్గట్టే.. ఎక్స్​టర్​ ఎస్​యూవీ వెయిటింగ్​ పీరియడ్​ కూడా ఉంది! ఎస్​ వేరియంట్​తో పాటు ఎస్​ఎక్స్​ సీఎన్​జీ మోడల్​కు 5 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ఇక ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​, ఎస్​ఎక్స్​(ఓ) ఏఎంటీ, ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​ ఏంటీ వేరియంట్​ల డెలివరీలకు గరిష్ఠంగా 8 నెలల సమయం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 1 ఏడాదిగా కూడా ఉంది.

Hyundai EXTER on road price : ఇప్పటికే మార్కెట్​లో ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీకి ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ గట్టిపోటీనిస్తోంది.

సంబంధిత కథనం