Tata Punch EV : టెస్ట్ రన్ దశలో టాటా పంచ్ ఈవీ.. ఇక లాంచ్ ఎప్పుడు?
Tata Punch EV launch date : టెస్టింగ్ దశలో ఉన్న టాటా పంచ్ ఈవీ.. మరోసారి దర్శనమిచ్చింది. లాంచ్ డేట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
Tata Punch EV launch date : టాటా పంచ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో.. ఈ మోడల్‌కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మరోసారి ఇండియన్ రోడ్లపై దర్శనమిచ్చింది. ఈ మోడల్‌కు సంబంధించి టెస్ట్ రన్ని తాజాగా నిర్వహించింది టాటా మోటార్స్ సంస్థ. ఫలితంగా డిజైన్ పరంగా ఇంకొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
టాటా పంచ్ ఈవీ విశేషాలు..
టెస్టింగ్ దశలో ఉన్న టాటా పంచ్ ఈవీకి సంబంధించిన స్పై షాట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఫొటోలు చూస్తుంటే.. నెక్సాన్ ఈవీ తరహా ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వస్తున్నట్టు కనిపిస్తోంది. ఐసీఈ ఇంజిన్‌తో పోల్చుకుంటే.. ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ డిజైన్‌లో మార్పులు చేసినట్టు అనిపిస్తోంది. గ్రిల్, బంపర్, 5 స్పోక్ అలాయ్ వీల్స్, రేర్ వీల్ డిస్క్ బ్రేక్స్‌ని కూడా మార్చినట్టు తెలుస్తోంది.
Tata Punch EV price Hyderabad : ఇటీవలి కాలంలో.. వాహనాలకు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్స్ని ఇస్తోంది టాటా మోటార్స్. అందుకే.. టాటా పంచ్ ఈవీలో కూడా దీనిని మనం చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా.. టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్‌లో భారీ మార్పులో కనిపిస్తాయట! భారీ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వయర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటివి ఈ ఈవీలో చూడొచ్చు.
Tata Punch EV launch : ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, రేర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉంటాయని సమాచారం.
టాటా పంచ్ ఈవీ లాంచ్ ఎప్పుడు?
ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు ఇంజిన్లు ఉంటాయని టాక్ నడుస్తోంది. ఒకటి మిడ్ రేంజ్, రెండోది లాంగ్ రేంజ్. బ్యాటరీ ప్యాక్, రేంజ్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
Tata Punch EV on road price Hyderabad : వాస్తవానికి ఈ మోడల్.. ఇప్పటికే లాంచ్ అయిపోయి ఉండాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు సెప్టెంబర్ నుంచి.. టాటా పంచ్ ఈవీ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఈ ఏడాది చివరి నాటికి.. ఈ మోడల్ని సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే.. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12లక్షలుగా ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
లాంచ్ తర్వాత.. ఈ మోడల్ సిట్రోయెన్ ఈసీ3కి గట్టిపోటీనిస్తుంది.
సంబంధిత కథనం