Tata Punch EV: టాటా పంచ్ ఈవీపై కీలక అప్ డేట్
Tata Punch EV: వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు పై కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సంవత్సరం నవంబర్ నెలలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
Tata Punch EV: వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు పై కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సంవత్సరం నవంబర్ నెలలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. టాటా పంచ్ ఈవీ ఈ నవంబర్ లో లాంచ్ చేయనుంది.
సేమ్ డిజైన్..
టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాదాపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా పంచ్ తరహాలోనే ఉండబోతోంది. బాడీ ప్యానెల్స్, అలాయ్ వీల్స్ డిజైన్, డైమెన్షన్స్.. ఇవన్నీ టాటా పంచ్ తరహాలోనే ఉండనున్నాయి. మిగతా టాటా పంచ్ కార్లకు, ఈవీ కార్లకు మధ్య తేడాను స్పష్టంగా చూపడం కోసం.. ఈవీ కారు బయటివైపు, లోపలివైపు ఈవీ (EV) బ్యాడ్జెస్ ను ఏర్పాటు చేశారు. ఈ కారును టాటా మోటార్స్ తమ ఆల్ఫా ప్లాట్ ఫామ్ పై ఉత్పత్తి చేస్తున్నారు. టాటా పంచ్ ఈవీలో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ తదితర రెగ్యులర్ ఫీచర్స్ తో పాటు 360 డిగ్రీ కెమెరా కూడా ఉండనుంది.
లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ
పంచ్ ఈవీలో టాటా మోటార్స్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీతో తమ సిగ్నేచర్ టెక్నాలజీ జిప్ ట్రాన్ ను ఉపయోగిస్తోంది. టాటా పంచ్ ఈవీ మార్కెట్లో సిట్రియోన్ ఈ సీ3, ఎంజీ కోమెట్ ఈవీలతో పోటీ పడనుంది. ఇటీవలే టాటా పంచ్ సీఎన్జీ వర్షన్ లాంచ్ అయింది. దీని ఎక్స్ షో రూమ్ ధర, వేరియంట్ ను బట్టి రూ. 7.10 లక్షల నుంచి రూ. 9.68 లక్షల వరకు ఉంది. ఇది ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ అనే మూడు వర్షన్లలో లభిస్తుంది.