Tata Punch iCNG : సన్‌రూఫ్‌తో టాటా పంచ్ ఐసీఎన్జీ లాంచ్.. ధర ఎంతంటే!
Tata Punch iCNG launched : టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్ తాజాగా లాంచ్ అయ్యింది. దీని ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Tata Punch iCNG launched : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మచ్ అవైటెడ్ మోడల్.. టాటా పంచ్ ఐసీఎన్జీని శుక్రవారం లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. మూడు వేరియంట్లలో (ప్యూర్, అడ్వెంచర్, అకంప్లీష్డ్) ఇది అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఈ సీఎన్జీ కారు హైలైట్స్ ఇవే..
టాటా పంచ్ ఐసీఎన్జీలో 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో.. ఇది 84.82 బీహెచ్పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ మోడ్‌లో దీని పవర్ 75.94, టార్క్ 97 ఎన్ఎంగా ఉంటుంది. 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ దీని సొంతం. మేన్యువల్ గేర్ బాక్స్ ఉండదు.
ఈ కారులో డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీ ఉండటం హైలైట్. భారీ సీఎన్జీ సిలిండర్ స్థానంలో రెండు చిన్న (30లీటర్లు) సిలిండర్లు ఉంటాయి. అంటే.. సిలిండర్ల కెపాసిటీ 60లీటర్లు. పైగా.. బూట్ స్పేస్ ఎక్కువగానే ఉండనుంది.
ఇదీ చూడండి:- Most affordable CNG cars : దేశంలో అత్యంత చౌకైన సీఎన్జీ కార్లు ఇవే..
Tata Punch iCNG mileage : టాటా పంచ్ సీఎన్జీ మోడల్లో లీక్ డిటెక్షన్ ఫీచర్ వస్తోంది. అంతేకాకుండా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్, రస్ట్ రెసిస్టెంట్ మెటీరియల్‌ను ఉపయోగించారు. థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ కూడా లభిస్తోంది. ఫ్యూయెల్ లిడ్ ఓపెన్ ఉండగా.. కారు స్టార్ట్ అవ్వకుండా ఉండేందుకు, ప్రత్యేక మైక్రో స్విచ్‌ను కూడా ఇచ్చింది టాటా మోటార్స్. సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుండటం మరో హైలైట్!
ఐసీఎన్జీ బ్యాడ్జింగ్‌ను మినహాయిస్తే డిజైన్, ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. కేబిన్‌లో సీఎన్జీ బటన్ వస్తోంది. సీఎన్జీ గేర్‌ను చూపించే విధంగా.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్డేట్ చేసింది సంస్థ.
కొత్త కారు ధర ఎంతంటే..
Tata Punch iCNG price in India : టాటా పంచ్ ఐసీఎన్జీని జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది టాటా మోటార్స్. ఇక తాజాగా లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 7.10లక్షలు- రూ. 9.68లక్షల మధ్యలో ఉంటుంది. మూడు వేరియంట్లతో పాటు అడ్వెంచర్ రిథమ్, అకంప్లీష్డ్ డాజిల్ ఎస్ ప్యాక్‌లో కూడా ఈ మోడల్ అందుబాటులో ఉండనుంది.
టాటా మోటార్స్‌కు ప్రస్తుతం టియాగో ఐసీఎన్జీ, టిగోర్ ఐసీఎన్జీ మోడల్స్ ఉన్నాయి. ఇక మూడో మోడల్‌గా మార్కెట్లోకి వస్తోంది ఈ టాటా పంచ్ ఐసీఎన్జీ.
సంబంధిత కథనం