వరంగల్‌లోని ‘నిట్’ లో లైబ్రరీ ట్రైనీ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు నవంబర్ 30వ తేదీతో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా భాగంగా ఐదు లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.