Best Diesel Cars : రూ.10 లక్షల ధరలో బెస్ట్ డీజిల్ కార్లు.. మంచి మైలేజీ, గొప్ప పనితీరు!
Best Diesel Cars Under 10L : పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కొందరికి డీజిల్ కార్లపై ఇష్టం ఉంటుంది. రూ.10 లక్షలో ధరలో ఉన్న బెస్ట్ డీజిల్ కార్లు ఏంటో చూద్దాం..
ప్రస్తుత మార్కెట్‌లోని ఎక్కువగా కంపెనీలు డీజిల్ కార్లను నెమ్మదిగా తగ్గిస్తున్నాయి. అయినా డీజిల్ కార్లకు జనాల్లో డిమాండ్ తగ్గలేదు. భారతదేశంలో సరసమైన, మంచి మైలేజీ, అత్యుత్తమ పనితీరుతో ఉన్న డీజిల్ కార్లు ఉన్నాయి. మీరు కూడా డీజిల్ కారు కొనేందుకు ఆసక్తిగా ఉంటే మీ కోసం లిస్టు ఉంది. ఈ కార్లు రూ. 10 లక్షలలోపు ధరతో దొరుకుతాయి. అవేంటో చూద్దాం..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ డీజిల్ కారు ధర రూ.9.99 లక్షల నుంచి మెుదలవుతుంది. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 పీఎస్ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది. మైలేజీ 13 నుండి 16 కి.మీ వరకు ఇస్తుంది.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ డీజిల్ ధర రూ. 11 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి మెుదలవుతుంది. 1497సీసీ ఇంజిన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది 113.31బిహెచ్‌పి పవర్, 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 23.23 కి.మీ మైలేజీని ఇస్తుంది.
మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో 7 సీటర్ ఎస్‌యూవీ ధర రూ.9.79 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. డీజిల్ మాన్యువల్‌లో 3 వేరియంట్‌లలో దొరుకుతుంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. లీటరుకు 16 కి.మీ మైలేజీని ఇస్తుంది.
కియా సోనెట్
కియా సోనెట్ డీజిల్ కారు ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1493సీసీ ఇంజిన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 114బిహెచ్‌పి పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 24.1 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ డీజిల్ కారు ధర రూ. 9.90 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉంది. లీటర్ డీజిల్‌కు 23.64 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు 1497 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీని ఇంజన్ 88.76బీహెచ్‌పీ పవర్, 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.