డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) అభ్యర్థన మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ (CSE Mains) 2023 రిజర్వ్ జాబితాను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2023 ఆధారంగా మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు 88 జనరల్, 5 ఈడబ్ల్యూఎస్, 23 ఓబీసీ, 3 ఎస్సీ, 1 ఎస్టీ కలిపి మొత్తం 120 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. కొత్తగా సిఫార్సు చేసిన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో తెలుసుకోవచ్చు. వీరిలో 30 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమేనని కమిషన్ తెలిపింది.
యూపీఎస్సీ సీఎస్ఈ 2023 ఫలితాలు 2024 ఏప్రిల్ 16న విడుదలయ్యాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), మరికొన్ని కేంద్ర సర్వీసులు, గ్రూప్ ఎ, గ్రూప్ బి ఖాళీలకు 1,016 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. 1,143 ఖాళీలకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు యూపీఎస్సీ విడుద చేసిన రిజర్వ్డ్ జాబితాలో.. వివిధ కేటగిరీల కింద ఏప్రిల్లో సిఫార్సు చేసిన చివరి అభ్యర్థి తర్వాత మెరిట్ క్రమంలో అభ్యర్థులు ఉంటారు.