Study abroad: ఇంజనీరింగ్ కోసం జర్మనీలో టాప్ 5 కాలేజీలు ఇవే; ప్రపంచంలోని బెస్ట్ కాలేజీల్లో ఇవి కూడా ఉన్నాయి..-study abroad 5 top institutions for engineering studies in germany ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Study Abroad: ఇంజనీరింగ్ కోసం జర్మనీలో టాప్ 5 కాలేజీలు ఇవే; ప్రపంచంలోని బెస్ట్ కాలేజీల్లో ఇవి కూడా ఉన్నాయి..

Study abroad: ఇంజనీరింగ్ కోసం జర్మనీలో టాప్ 5 కాలేజీలు ఇవే; ప్రపంచంలోని బెస్ట్ కాలేజీల్లో ఇవి కూడా ఉన్నాయి..

Sudarshan V HT Telugu
Oct 23, 2024 04:55 PM IST

Study abroad: విదేశాల్లో ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నారా?.. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోనే కాదు.. జర్మనీలో కూడా బెస్ట్ కాలేజీలు ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ ప్రకారం జర్మనీలోని టాప్ 5 ఇన్ స్టిట్యూట్ లను చూడండి. విదేశీ విద్యార్థులకు జర్మనీలో మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.

జర్మనీలో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు
జర్మనీలో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు

Study abroad: ఇంజినీరింగ్ లాంటి ముఖ్యమైన సబ్జెక్టును అధ్యయనం చేయాలంటే సరైన సంస్థను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాల్లోని కాలేజీల్లోనే చేరడానికిి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, అవే బెస్ట్ కాలేజీలన్న నమ్మకంతో. అయితే, యూరోప్ దేశం జర్మనీలో కూడా ప్రపంచంలోని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం ఇంజనీరింగ్ కోసం అత్యంత ఉన్నత ర్యాంకు పొందిన సంస్థలను కలిగి ఉన్న దేశంగా జర్మనీ ఉంది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థుల కోసం ఇక్కడ జర్మనీలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల వివరాలను అందిస్తున్నాం. ఇవి ప్రపంచంలోని 100 ఉత్తమ విశ్వవిద్యాలయాలలో స్థానం పొందిన విద్యా సంస్థలు

టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్

జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్న టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్ (Technical University of Munich) క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 లో 19వ స్థానంలో ఉంది. ఓవరాల్ గా 84.4 స్కోర్ తో ఈ యూనివర్సిటీ జర్మనీలోని ఉత్తమ ఇంజినీరింగ్ సంస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

2. టెక్నిష్ యూనివర్శిటీ బెర్లిన్

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో ఇది 45 వ స్థానంలో ఉంది, టెక్నిష్ యూనివర్శిటీ బెర్లిన్ (Technische Universität Berlin -TU Berlin) జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఉంది. ఈ సంస్థ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సుల నుండి డాక్టోరల్ ప్రోగ్రామ్ లు, మరెన్నో ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుంది క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో. TU బెర్లిన్ సాధించిన మొత్తం స్కోరు 79.1.

3. కేఐటీ - కార్ల్స్ రూహ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 లో కిట్, కార్ల్స్రూహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Karlsruhe Institute of Technology) 48వ స్థానంలో ఉంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 లో ఈ సంస్థకు మొత్తం 79 మార్కులు వచ్చాయి. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి ఇంజనీరింగ్ కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నారు.

4. ఆర్ డబ్ల్యూటీహెచ్ ఆచెన్ యూనివర్సిటీ

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 లో 54 వ ర్యాంక్ తో ఆర్ డబ్ల్యూటీహెచ్ ఆచెన్ యూనివర్సిటీ (RWTH Aachen University) ఇంజినీరింగ్ విద్యలో జర్మనీలోని నాలుగో ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ ఇంజినీరింగ్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ తదితర కోర్సులున్నాయి. ఈ సంస్థ మొత్తం 78.3 స్కోరు సాధించింది.

5. టెక్నిష్ యూనివర్శిటీ

టెక్నిష్ యూనివర్శిటీ (Technische Universität) ఇంజనీరింగ్ స్టడీస్ కోసం క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024 లో 99 వ స్థానంలో ఉంది. డ్రెస్ డెన్ లో ఉన్న ఈ విశ్వవిద్యాలయం సివిల్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మరెన్నో ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుంది. టియు డ్రెస్డెన్ మొత్తం స్కోరు 99.

Whats_app_banner