University Rankings: ఐఐఆర్ఎఫ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో హైదరాబాద్ యూనివర్సిటీ
ఇండియన్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (IIRF) 2024 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ యూనివర్సిటీలకు ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
University Rankings: ఇండియన్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (IIRF) 2024 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ యూనివర్సిటీలకు ర్యాంకులను విడుదల చేసింది. 7 పనితీరు ప్రమాణాల ఆధారంగా ఐఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులను ఇచ్చింది. ప్లేస్మెంట్ పనితీరు, టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్, ఇండస్ట్రీ ఇన్కమ్ అండ్ ఇంటిగ్రేషన్, ప్లేస్మెంట్ స్ట్రాటజీస్ అండ్ సపోర్ట్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశ్రమ నిపుణులు, పూర్వ విద్యార్థులు విశ్వసించే ఎక్స్టర్నల్ పర్సెప్షన్ తదితర పారా మీటర్లను ప్రామాణికంగా తీసుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు..
భారతదేశంలోని విశ్వవిద్యాలయాలను నాలుగు విభాగాలుగా ఐఐఆర్ఎఫ్ విభజించింది. అవి కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. వీటికి కేటగిరీల వారీగా ర్యాంకింగ్స్ ను ఇచ్చింది. 2024 లో భారతదేశంలోని టాప్ 10 కేంద్రీయ విశ్వవిద్యాలయాల వివరాలను ఇక్కడ చూద్దాం. ఈ లిస్ట్ లో హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆరోస్థానంలో నిలిచింది.
టాప్ లో జే ఎన్ యూ
ఈ ఏడాది టాప్ ర్యాంక్స్ సాధించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్లేస్ మెంట్ పెర్ఫార్మెన్స్ (పీపీ), టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ పెడగాజీ (టీఎల్ ఆర్ పీ) తదితర విభాగాల్లో జే ఎన్ యూ అధిక స్కోర్లు సాధించింది.
- ర్యాంక్ 2: DU - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
- ర్యాంక్ 3: BHU - బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
- ర్యాంక్ 4: JMI - జామియా మిలియా ఇస్లామియా
- ర్యాంక్ 5: AMU - అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
- ర్యాంక్ 6: UoH - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- ర్యాంక్ 7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
- ర్యాంక్ 8: పాండిచ్చేరి యూనివర్సిటీ
- ర్యాంక్ 9: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్
- ర్యాంక్ 10: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్