CUET 2022 | సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు.. ప్రాంతీయ భాషల్లో పరీక్ష.. దరఖాస్తు ఎప్పుడంటే..
సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) జరగనుంది. అయితే ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారం నుంచి మెుదలవుతుంది.
దేశంలోని మెుత్తం.. 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సీయూఈటీ ప్రేవశపరీక్ష నిర్వహించనున్నారు. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్షను మెుత్తం 13 భాషల్లో నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.
'13 భాషల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు కోసం చాలా అప్షన్స్ ఇచ్చాం. సీయూఈటీ అనేది ఒక సంస్కరణ. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ కోసం CUET స్కోర్‌ను ఉపయోగించవచ్చు. 12వ తరగతి మార్కుల ఆధారంగా కాకుండా సీయూఈటీ ఆధారంగా ఉండాలి. 2022–23 నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సీయూఈటీ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయి.' అని జగదీశ్ కుమార్ చెప్పారు.
12వ తరగతి మార్కుల ఆధారంగా వెయిటేజీ ఉండదని యూటీవలే యూజీసీ తెలిపింది. అందులో భాగంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సీయూఈటీ పరీక్షను హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియాతోపాటు ఇంగ్లీష్ భాషలలో నిర్వహించనున్నారు.
సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఇతర యూనివర్సిటీలు సైతం CUET 2022 మార్కులను పరిగణనలోకి తీసుకుంటాయి. దీనికి సంబంధించిన వివరాలు.. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ www.nta.ac.in లో ఉంటాయి. జులై మొదటి వారంలో సీయూఈటీ పరీక్ష జరిగే ఛాన్స్ ఉంది. మెుత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీలు..యూజీసీ పరిధిలో ఉన్నాయి. ఎన్టీఏ ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం.. యూజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేసుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా కామన్ కౌన్సెలింగ్ మాత్రం ఉండదు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA CUET 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 2022 మొదటి వారం నుండి ప్రారంభిస్తుంది. nta.ac.inలో NTA అధికారిక సైట్‌లో ఏజెన్సీ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. UGC ద్వారా రాబోయే విద్యా సంవత్సరం 2022-23 నుంచి దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి ప్రవేశానికి 12వ తరగతి మార్కులు పరిగణించరు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం పరీక్ష జూలై మొదటి వారంలో ఎన్టీఏ నిర్వహిస్తుంది.
టాపిక్