Passport rankings | 2022 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 87వ స్థానం సాధించింది. వీసా ఫ్రీ(visa-free), వీసా ఆన్ అరైవల్(visa-on-arrival) వెసులుబాటు ఉన్న దేశాల వివరాలతో ప్రతీ సంవత్సరం ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు. దీన్ని `హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్` అంటారు. ఈ ఇండెక్స్‌లో వీసా ఫ్రీ, లేదా వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు ఉన్న దేశాల సంఖ్యను బట్టి ర్యాంకింగ్స్‌ను ఇస్తారు. భారత్ పాస్‌పోర్ట్‌కు 60 దేశాల్లో ఈ visa-free, లేదా visa-on-arrival సౌలభ్యం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో జపాన్ నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌కు 193 దేశాల్లో వీసా ఫ్రీ సౌలభ్యం ఉంది. ఆ తరువాత స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌కు 192 దేశాల్లో వీసా ఫ్రీ ఫెసిలిటీ ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున అఫ్గానిస్తాన్ ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఇరాక్, సిరియా, పాకిస్తాన్ ఉన్నాయి. అంటే, వరస్ట్ పాస్‌పోర్ట్ దేశాల్లో పాకిస్తాన్‌ది నాలుగో స్థానం. ఈ పాస్‌పోర్ట్‌తో 32 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..