దేశ రాజధాని ఢిల్లీ మండుటెండల నుంచి ఉపశమనం పొందిందనే లోపు భారీ వర్షానికి నీట మునిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. అంతే కాకుండా జనం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మునిర్కా, సరితా విహార్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే వాన కురుస్తోంది.