Germany jobs: బిఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేస్తే జర్మనీలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ శిక్షణ..-ap govt training for jobs in germany after completing bsc nursing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Germany Jobs: బిఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేస్తే జర్మనీలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ శిక్షణ..

Germany jobs: బిఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేస్తే జర్మనీలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ శిక్షణ..

HT Telugu Desk HT Telugu
Aug 23, 2023 10:53 AM IST

Germany jobs: బిఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సులుగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం శిక్షణనిస్తోంది. ఏపీఎన్నార్టీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల ద్వారా అర్హులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు.

జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు శిక్షణ
జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు శిక్షణ

Germany jobs: ఏపీలో బిఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సెస్ గా అవకాశం కల్పిస్తు న్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, టిఏకెటి ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ నాన్-రెసి డెంట్ తెలుగు సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి జర్మనీలో స్టాఫ్ నర్సెస్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి, కనీసం రెండేళ్ళు ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. జర్మన్ భాష నేర్చుకునేందుకు ఆసక్తి, అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వ విద్యాలయంలో జర్మన్ భాషపై ఉచిత ఆన్లైన్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని తెలిపారు.

జర్మనీ భాషలో కనీసం బి1 స్థాయి ఉత్తీర్ణత స్థాయి సాధించిన తర్వాత జర్మనీలో పని చేయడానికి ఆఫర్ లెటర్ ఇస్తారని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల జర్మనీ ప్రయాణం కోసం విమాన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత మొదటి 6 నెలల పాటు ఆహారం, వసతి ఉచితంగా అందిస్తారు. నెలకు వేతనం వెయ్యి యూరోలు చెల్లిస్తారు. భారతీయ కరెన్సీ రూ.89,000ల వేతనం లభిస్తుంది.

అనంతరం ఆరు నెలల పాటు జర్మ నీలో బి సర్టిఫికేషన్ కోసం శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. బి2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు దాదాపు 2,500 యూరోల వేతనం పొందవచ్చని తెలిపారు. ఈ నెల 30వ తేదీ రిజిస్ట్రేషన్‌లకు చివరి తేది అని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలను www.apssdc.in/home/online program- registration పంపాల్సి ఉంటుంది. జర్మనీలో ఉపాధి కోసం ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికేట్ ‌లతో పాటె రెజ్యూ మ్‌ను mailto:helpline@apssdc.in మెయిల్ ఐడీ లేదా కాల్ సెంటర్ 9988853335 నెంబర్కు పంపించాలని తెలిపారు.

Whats_app_banner