HPCL recruitment 2023: హిందుస్తాన్ పెట్రోలియంలో మెకానికల్ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
HPCL recruitment 2023: మెకానికల్ ఇంజనీర్ సహా పలు పోస్ట్ ల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock/ Representative photo)
HPCL recruitment 2023: మెకానికల్ ఇంజనీర్ సహా పలు పోస్ట్ ల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ hindustanpetroleum.com. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
లాస్ట్ డేట్, ఇతర వివరాలు..
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18. మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటంట్ , ఇన్స్టుమెంట్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ తదితర మొత్తం 276 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు, అనుభవం మొదలైన పూర్తి వివరాలను అభ్యర్థులు hindustanpetroleum.com. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 1800 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
how to apply: ఇలా అప్లై చేయండి..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ hindustanpetroleum.com ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే career ట్యాబ్ ను క్లిక్ చేయాలి.
- అందులో కనిపించే Recruitment of Officers 2023-24 లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్టర్ అయిన తరువాత, అప్లికేషన్ ఫామ్ ను ఓపెన్ చేసి, వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒక హార్డ్ కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
- Direct link to apply