UPSC Free Coaching: బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోండి..
UPSC Free Coaching: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్‌కు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లిఖార్జున ప్రకటించారు. ఏపీస్టడీ సర్కిల్‌లో కోచింగ్ అందిస్తారు.
UPSC Free Coaching: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఏపీ బీసీ సంక్షేమ శాఖ ప్రటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కొరకు అర్హత గల బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ సంచాలకులు డా. ఏ. మల్లిఖార్జున తెలిపారు.
సివిల్స్ శిక్షణ కోసం విద్యార్థులకు ప్రత్యేకంగా ఏపీ స్టడీ సర్కిల్ బీసీ భవన్ గొల్లపూడి విజయవాడలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికైన 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు.
శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం బీసీలలో 66%, ఎస్సీలలో 20%, ఎస్టీలలో 14% ప్రకారంఎంపిక చేస్తారని తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు శిక్షణ ప్రాంగణంలో ఉచిత బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ లకు చెందిన సమర్ధవంతమైన అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 24వ తేదీ లోపు సివిల్స్ పరీక్షలకు దరఖాస్తులను సమర్పించాలపి బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సూచించింది. దరఖాస్తులను జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు చేయడం ఎలా…
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కుల జాబితా, విద్యార్హత వివరాలు (డిగ్రీ వివరాలు) కమ్యూనిటీ (కుల ధ్రువీకరణ పత్రం) మొదలైన ధ్రువపత్రాల నకళ్ళు సమర్పించాలి. రెండు పాస్ పోర్టు ఫోటోలను దరఖాస్తుకు జత చేయాలి.
సివిల్స్ స్క్రీనింగ్ టెస్ట్ నవంబర్ 27వ తేదీన నిర్వహిస్తారు. ఉచిత కోచింగ్ ప్రారంభమయ్యే తేదీలతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ జరిగే ప్రదేశం, వేదిక పరీక్ష సమయాలను త్వరలో వెల్లడిస్తారు.
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రంగంలో ఎంపిక చేసిన ప్రముఖ కోచింగ్ ఇన్సిట్యూట్ సహకారంతో ఈ ఉచిత శిక్షణ అందజేయనున్నట్టు అధికారులు వివరించారు. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున సూచించారు.