Poverty Index | ఆంధ్రప్రదేశ్ : బహుముఖ పేదరికంలో కర్నూలు మొదటి స్థానం-kurnool tops multidimensional poverty index by niti ayog ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Poverty Index | ఆంధ్రప్రదేశ్ : బహుముఖ పేదరికంలో కర్నూలు మొదటి స్థానం

Poverty Index | ఆంధ్రప్రదేశ్ : బహుముఖ పేదరికంలో కర్నూలు మొదటి స్థానం

Praveen Kumar Lenkala HT Telugu
May 05, 2023 03:27 PM IST

నీతి ఆయోగ్ రూపొందించిన బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌)లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో విభిన్న రంగాల్లో 12.31 శాతం మంది పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది.

<p>నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ నివేదిక</p>
నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ నివేదిక (niti ayog)

బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ MDPI)లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ను బేస్ లైన్‌గా తీసుకుని ఈ నివేదికను రూపొందించి నవంబరు 26న ఆవిష్కరించింది.

కేవలం ఆదాయం ప్రాతిపదికన కాకుండా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు తదితర మూడు కేటగిరీలను ఎంచుకుని, వీటిలో విభిన్న సూచీలకు స్కోర్ కేటాయించింది. ఆరోగ్యంలో పౌష్ఠికాహారం, శిశు, కౌమారదశ మరణాలు, శిశు ఆరోగ్యం సూచీలకు, అలాగే విద్యలో పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు సూచీలకు స్కోరు ఇచ్చింది. 

అలాగే జీవన ప్రమాణాలలో వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, నివాస గృహం, ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలు తదితర సూచీలకు స్కోరు కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో అంశాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా 

 ఆంధ్రప్రదేశ్‌లో అంశాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా శాతం
 అంశం జనాభా(శాతం) పారామితి 
 పౌష్ఠికాహార లోపం  26.38 ఐదేళ్లలోపు చిన్నారులు, 15-49 ఏళ్ల మహిళలు, 15-54 ఏళ్ల పురుషులు
 శిశు, కౌమారదశ మరణాలు 1.82 ఐదేళ్ల ముందు వరకు ఆ కుటుంబంలో చనిపోయిన 18 ఏళ్లలోపు పిల్లలు
 శిశు ఆరోగ్యం 9.66 చిన్నారులకు వైద్య సిబ్బంది ద్వారా సేవలు అందకపోవడం
 పాఠశాల సంవత్సరాలు 16.90 ఒక కుటుంబంలో పదేళ్లు, అంతకుమించి వయస్సు ఉన్న వారిలో కనీసం ఒక్కరూ ఆరేళ్ల పాఠశాల విద్య పూర్తిచేయకపోవడం
 పాఠశాల హాజరు 1.70 ఎనిమిదో తరగతి పూర్తిచేసే వయసొచ్చినా బడికి వెళ్ళని వారు
వంట ఇంధనం16.40కట్టెలు, పేడ, బొగ్గు, వ్యవసాయ వ్యర్థాలతో వంట చేసుకునే కుటుంబాలు
పారిశుద్ధ్యం22.70పారిశుద్ధ్య వ్యవస్థ లేని కుటుంబాలు, లేదా ఇతర కుటుంబాలతో కలిసి వాడుకునే వారు
తాగునీరు9.30ఇంటి నుంచి వెళ్లి సురక్షిత నీళ్లు తెచ్చకునేందుకు కనీసం 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టడం
విద్యుత్తు 0.50విద్యుత్తు సరఫరా లేని కుటుంబాలు
నివాసం14.70పక్కా ఇల్లు లేని కుటుంబాలు
ఆస్తులు11.00రేడియో, టీవీ, టెలిఫోన్, కంప్యూటర్, సైకిల్, మోటారు, బైక్ ఫ్రిజ్, వంటి వాటిలో ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు లేకపోవడం, అలాగే కారు, ట్రక్కు వంటివి లేకపోవడం
బ్యాంకు ఖాతాలు3.60బ్యాంకు, పోస్టాఫీస్‌లో ఖాతాలు లేని కుటుంబాలు

ఏ జిల్లాలో ఎక్కువ పేదరికం ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లో మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ప్రకారం అత్యంత ఎక్కువగా పేదరికం ఉన్న జిల్లాలు కర్నూలు, విజయనగరం, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం. 

ఈ మొదటి ఐదు జిల్లాల్లో మూడు ఉత్తరాంధ్రవే కావడం గమనార్హం. అలాగే రాయలసీమలోని కర్నూలు మొదటి స్థానంలో ఉంది. గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేదరికం తక్కువగా ఉంది.

జిల్లాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా

జిల్లాపేదరికం ఉన్న జనాభా(శాతంలో)
కర్నూలు20.69
విజయనగరం19.00
ప్రకాశం15.63
విశాఖపట్నం15.10
శ్రీకాకుళం14.01
అనంతపురం13.24
నెల్లూరు11.67
చిత్తూరు10.34
వైెఎస్సార్ కడప9.96
వెస్ట్ గోదావరి9.11
కృష్ణా8.98
ఈస్ట్ గోదావరి8.55
గుంటూరు8.31

బహుముఖ పేదరిక సూచీలో రాష్ట్రాల స్థానం ఇలా..

 రాష్ట్రంపలు రంగాల్లో పేదరికం అనుభవిస్తున్నజనాభా శాతం
 బిహార్51.91
 జార్ఖండ్42.16
ఉత్తరప్రదేశ్  37.79
 మధ్య ప్రదేశ్  36.65
 మేఘాలయ 32.67
 అస్సాం  32.67
ఛత్తీస్ గఢ్29.91
 రాజస్తాన్  29.46
 ఒడిశా  29.35 
నాగాలాండ్  25.23
 అరుణాచల్ ప్రదేశ్ 24.27
 పశ్చిమ బెంగాల్21.43
గుజరాత్18.60
 మణిపూర్17.89
ఉత్తరాఖండ్17.72
త్రిపుర16.65
మహారాష్ట్ర14.85
తెలంగాణ13.74
కర్ణాటక13.16
ఆంధ్రప్రదేశ్12.31
హర్యానా12.28
మిజోరం9.80
హిమాచల్‌ప్రదేశ్7.62
పంజాబ్5.59
తమిళనాడు4.89
సిక్కిం3.82
గోవా3.76
కేరళ0.71

కేంద్ర పాలిత ప్రాంతాల్లో బహుముఖ పేదరికం అనుభవిస్తున్న జనాభా 

కేంద్ర పాలిత ప్రాంతంజనాభా శాతం
దాద్రా నగర్ హవేలీ27.36
జమ్మూ కశ్మీర్, లద్దాఖ్12.56
దామన్ డయ్యూ6.82
చంఢీగఢ్5.97
ఢిల్లీ4.79
అండమాన్ నికోబార్ దీవులు4.30
లక్షద్వీప్1.82
పుదుచ్చేరి1.72

Whats_app_banner