Toxic Job: మీ జాబ్‌ ఇలా ఉంటే మానేయడం మంచిది, లేదంటే మానసిక ఒత్తిడి మీ వెంటే ఉంటుంది-signs of toxic job and work environment or know how to manage it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toxic Job: మీ జాబ్‌ ఇలా ఉంటే మానేయడం మంచిది, లేదంటే మానసిక ఒత్తిడి మీ వెంటే ఉంటుంది

Toxic Job: మీ జాబ్‌ ఇలా ఉంటే మానేయడం మంచిది, లేదంటే మానసిక ఒత్తిడి మీ వెంటే ఉంటుంది

Koutik Pranaya Sree HT Telugu
Aug 20, 2024 08:00 AM IST

Toxic Job: మన జీవితంలో ఎక్కువ సేపు సమయం ఉద్యోగం చేస్తూనే గడిపేస్తాం. ఆ పని చేసే వాతావరణం గనక సరిగ్గా లేకపోతే చాలా కష్టం. అసలు పని చేసే చోటులో, ఉద్యోగంలో సరైన వాతావరణం లేకపోతే దీర్ఘాకాలికంగా ఒత్తిడి తప్పదు.

టాక్సిక్ జాబ్ లక్షణాలు
టాక్సిక్ జాబ్ లక్షణాలు (freepik)

మీరు ఏ రకం అయిన ఉద్యోగం చేస్తున్నా.. అది మీ ఎదుగుదలకు మాత్రం ఉపయోగపడాలి. మీకు సంతృప్తినివ్వాలి. పని చేయాలనే ఉత్సాహం కలిగించాలి. అలా కాకుండా కొన్ని లక్షణాలుంటే మాత్రం మీకు టాక్సిక్ పనిచోటులో జాబ్ చేస్తున్నట్లే. వీలైతే ఆ జాబ్ మానేసి మంచి జాబ్ వెతుక్కోవడమో.. కుదరకపోతే ఆ వాతావరణం ప్రభావం మానసికంగా పడకుండా మిమ్మల్ని మీరు సిద్ధ చేసుకోవడం తప్పనిసరి. 

అలసట, అనారోగ్యం

మీరు చేసే జాబ్ సరిగ్గా లేకపోతే, లేదా మీకు నప్పేది కాకపోతే పని చేయాలంటేనే చాలా అలసటగా అనిపిస్తుంది. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఒత్తిడి తట్టుకోలేక తరచూ అనారోగ్యానికీ గురవుతారు. మీ ఉద్యోగం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అనిపిస్తే ఒకసారి ఆలోచించాల్సిందే. రోజంతా చేయాల్సిన పని మీలో ఉత్సాహం నింపాలి కానీ నీరసం కాదు. ఇలాంటి ఉద్యోగం ఎక్కువ రోజులు చేయలేరు. 

గాసిప్స్

ఉద్యోగమనే కాకుండా ప్రతిచోటా మన వెనకాలు మనగురించి మాట్లాడేవాళ్లుంటారు. గుసగుసలు, ముచ్చట్లు పెట్టేవాళ్లుంటారు. కానీ అది మీకు ఇబ్బంది కలిగించేట్టు ఉండకూడదు. మీ గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నా, కొందరు ఒక గ్రూపులాగా తయారయ్యి మిమ్మల్ని వేరు చేస్తున్నా మీరు పని చేస్తున్న వాతావారణం సరిగ్గా లేనట్లే. పని చేసే చోట స్నేహితులుండటం సాధారణమే. కానీ ఆ స్నేహం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. వీటివల్ల మరీ ఇబ్బంది లేకపోతే పట్టించుకోనక్కర్లేదు.

ఎదుగుదల లేకపోతే

మీరు చేస్తున్న పని మీ తెలివితేటల్ని పెంచేలాగా ఉండాలి. మీ భవిష్యత్తుకు కొత్త అవకాశాలు సృష్టించేలా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ పరిజ్ఞానం పెంచేందుకు మీకు మద్దతివ్వాలి. అలా లేని ఉద్యోగం మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. 

మీ పై అధికారులు:

మీ పనిని పరిశీలించే పై అధికారులు, బాస్, మేనేజర్ ఎవరైనా సరే.. వాళ్ల తీరు మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. తరచూ మిమ్మల్ని తక్కువ చేయడం, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, మీ సామర్థాన్ని ప్రశ్నించడం లాంటివి చెడ్డ మేనేజర్ లక్షణాలు. లీడర్‌షిప్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లు మాత్రమే అలా ఉంటారు. మంచి బాస్ కింద పనిచేస్తే ఇంట్లో ఉండి కుటుంబం కోసం పని చేస్తున్నామనే సంతృప్తి ఉంటుంది. ఈ సంతృప్తి లేకపోతే సరైన నిర్ణయం తీసుకోండి. 

సరిహద్దులు లేకపోవడం:

ప్రతి ఉద్యోగానికి పని వేళలుంటాయి. అప్పుడప్పుడు పనివేళలు దాటాక పని చేయడం సాధారణమే. కానీ అవసరం లేకపోయినా తరచూ సమయం కన్నా ముందే ఆఫీసుకు రావాలని ఒత్తిడి పెట్టడం, పని లేకపోయినా ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉండాలనడం మంచి విషయం కాదు. దీంతో మీ కుటుంబంతో సమయం సరిగ్గా కేటాయించుకోలేరు. మీ వ్యక్తిగత పనులను చేసుకోలేరు. మీకంటూ సమయం లేకుండా పోతుంది. 

ఎలా బయటపడాలి? 

1. పని ఒత్తిడిని తట్టుకోవడం తప్పనిసరి అయితే దాన్నుంచి బయటపడే మార్గాలు చూసుకోండి. దీర్ఘకాలం ఒత్తిడి మంచిది కాదు. దానికోసం పుస్తకాలు చదవడం, డైరీ రాయడం, వ్యాయామం చేయడం, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి. 

2. సానుకూలంగా ఆలోచిస్తే ఏ సమస్య నుంచైనా బయటపడొచ్చు. చుట్టూ నెగటివ్ వాతావారణం,మనుషులు ఉన్నప్పుడు మీరే అన్నింటిని తేలికగా తీసుకోవడం మంచిది.  వాటివల్ల ఒత్తిడి పడకుండా చూసుకోండి. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లడమే.

 

 

 

 

టాపిక్