Friday Quote : బేకార్ ముచ్చట్లు పక్కన పెట్టి.. మీ లైఫ్ని తీర్చిదిద్దుకోండి..
జీవితంలో మీకు నచ్చిన, కొత్తవి, భిన్నమైన మార్గాలను ప్రయత్నించండి. ఎందుకంటే ఉన్నది తక్కువ సమయం. ఎప్పుడో ఏమి జరుగుతుందో తెలియని ఈ లైఫ్లో మీకు నచ్చిన పనులు చేయండి. అంతే కానీ ఇతరుల గురించి ఆలోచిస్తూ.. మీ జీవితాన్ని వృథా చేసుకోకండి.
Friday Quote : మీకున్న సమయం చాలా తక్కువ. మీరు ఎప్పటివరకు ఉంటారో మీకే తెలియదు. ఎన్నాళ్లు బ్రతుకుతామో తెలియని ఈ జీవితంలో.. మీ గురించి మీరు ఆలోచించుకోవడమే ఉత్తమం. వేరొకరి గురించి.. వేరొకరి లైఫ్ గురించి ఆలోచిస్తూ.. మీకున్న కొద్ది సమయాన్ని పాడు చేసుకోకండి. అలాగే ఇతరులు కూడా మీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఇవ్వకండి.
ఇది ఇతరుల ఆలోచనలు, ఫలితాలతో జీవించడం మీకే మంచిది కాదు. ఇతరుల అభిప్రాయాలు మీ అంతర్గత స్వరాన్ని అణచివేస్తాయి. కాబట్టి మీ మనసు చెప్పింది మాత్రమే మీరు చేయండి. అది మంచి అయినా.. చెడు అయినా ఫలితం మీకే మిగులుస్తుంది. మీ హృదయాన్ని, అంతర్ దృష్టిని అనుసరించే ధైర్యం మీరు కచ్చితంగా కలిగి ఉండాలి.
సమయం, ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు. సమయం చాలా విలువైనది. ఇది ఎవరికోసం ఆగదు. ప్రపంచంలోని ఏ కరెన్సీ నోటు కూడా దానిని కొనలేదు. కాబట్టి సమయం ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోండి. దానికి తగ్గట్లుగా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. జీవితంలో ముగింపు అనివార్యం. కానీ మనం చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. తగినంత అనుభవంతో జీవితం ఎలా సాగాలో మీరే నిర్ణయించుకోండి. ఇతరుల నుంచి ప్రేరణ పొందండి. మీ ఆలోచనల గురించి సన్నిహితులతో చర్చించండి. అందరూ చెప్పేది విని.. ఫైనల్గా మీ నిర్ణయం మీరే తీసుకోండి. తద్వారా మీరు మీ సొంత నిర్ణయానికి చింతించకండి.
జీవితంలో మీకు ఏమి కావాలో తెలుసుకున్న తర్వాత దాని కోసం పని చేయడం ప్రారంభించండి. మీరు కోరుకున్న విధంగా ప్రతిదీ జరగదు. మీ జీవితం కూడా అంతేనని గుర్తించుకోండి. మీ జీవితాన్ని మీరే సొంతం చేసుకోండి. మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఎవరైనా ప్రభావితం చేయడం మంచిది. కానీ మీరు మోసపోకుండా ఉండడమే ముఖ్యం. మనమందరం భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సమాజం మనపై విసురుతున్న పోకడలకు తలొగ్గకపోతే ఫర్వాలేదు. మీ కలలను సాకారం చేసుకోవడానికి, మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి మీరు కష్టపడి పనిచేయడమే అర్థవంతమైన జీవితం.
సంబంధిత కథనం
టాపిక్