Before Marriage: పెళ్లికి ముందే లైంగిక అనుబంధాలను పెట్టుకోవడం మంచిదేనా? దాని వల్ల కలిగే మంచి చెడులు ఏమిటి?-is it good to have sex before marriage what are the pros and cons of that ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Before Marriage: పెళ్లికి ముందే లైంగిక అనుబంధాలను పెట్టుకోవడం మంచిదేనా? దాని వల్ల కలిగే మంచి చెడులు ఏమిటి?

Before Marriage: పెళ్లికి ముందే లైంగిక అనుబంధాలను పెట్టుకోవడం మంచిదేనా? దాని వల్ల కలిగే మంచి చెడులు ఏమిటి?

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 09:33 AM IST

Before Marriage: పెళ్లికి ముందు భాగస్వామితో శారీరక సంబంధం పెట్టుకోవడం సరైనదేనా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. అయితే, ఇది కొన్ని ప్రయోజనాలను, అలాగే కొన్ని నష్టాలను కూడా కలిగి ఉంది.

పెళ్లికి ముందు లైంగిక సంబంధం మంచిదేనా?
పెళ్లికి ముందు లైంగిక సంబంధం మంచిదేనా? (pexel)

పూర్వకాలంలో పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిల మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండేది కాదు. అలా పెట్టుకోవడం చాలా తప్పుగా చూసేవారు. ఆడపిల్లలకు అప్పట్లో ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఉండేది కాదు. వారు ఇంట్లోనే ఉండేవారు, బయటికి వెళ్లేవారు కారు. క్రమక్రమంగా కాలం మారింది. ఆలోచనలు మారాయి. చదువులు, ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు దూరంగా వచ్చేస్తున్నారు యువత. ఆ క్రమంలో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి.

కుటుంబానికి దూరంగా యువత వివాహానికి ముందు శారీరక సంబంధాలను పెట్టుకోవడం ఎక్కువైపోయింది. రిలేషన్షిప్లోకి వచ్చిన కొన్ని రోజులకే అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది పెళ్లికి ముందు తమ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో భార్యాభర్తల్లా జీవిస్తున్నారు. కొంతమందికి ఇందులో తప్పేమీ కనిపించదు. మరికొందరికి మాత్రం దీన్ని పూర్తి తప్పుగా భావిస్తారు.

పెళ్లికి ముందే లైంగిక అనుబంధాన్ని పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని, అలాగే నష్టాలు ఉన్నాయని చెబుతున్నాయి అధ్యయనాలు.

పెళ్లికి ముందు లైంగిక అనుబంధం ఉంటే…

వివాహానికి ముందు శారీరక సంబంధం కలిగి ఉండటం వల్ల ఒకరికి ఒకరు పూర్తిగా అర్థమవుతారని చెప్పుకుంటారు. ఇది ఒకరి ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా మీ భాగస్వామి పరిశుభ్రత గురించి ఎంత శ్రద్ధ వహిస్తారు? ఏ సందర్భంలో ఎలా ఉంటారు అనే విషయాలను మరింత లోతుగా తెలుసుకోవచ్చు. అలాగే శారీరక సంబంధాల ద్వారా శరీరంలో ఉన్న అభద్రతా భావాలు కూడా తొలగిపోతాయి. దీని వల్ల జంటలు భవిష్యత్తులో సాన్నిహిత్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించగలుగుతారు. వారి మధ్య బంధం బలపడుతుంది.

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే జంటల మధ్య ఆరోగ్యకరమైన శారీరక సంబంధం ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలు శారీరకంగా పూర్తిగా కనెక్ట్ కాలేక విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. వివాహానికి ముందు శారీరక సంబంధాల్లో పాల్గొనడం ద్వారా, జంటలు తమ మధ్య శారీరక అనుకూలత ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. వారు తమ భవిష్యత్తు కోసం సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

ఇద్దరూ ఒకేలాంటి లైంగిక ప్రవర్తనను కలిగి ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ కొందరు సున్నితమైన సెక్స్ కోరుకుంటే, మరికొందరు వైల్డ్ సెక్స్ ను ఇష్టపడతారు. వైల్డ్ సెక్స్ ఇష్టం లేనివారు, దానిలో సౌకర్యవంతంగా ఫీలవ్వని వారు పెళ్లి తరువాత చాలా ఇబ్బందులు పడవచ్చు. వివాహానికి ముందు శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా, ఒకరి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి… వైల్డ్ సెక్స్ ఇష్టపడకపోతే ఆ బంధాన్ని అక్కడే ఆపేయవచ్చు.

పెళ్లికి ముందు సెక్స్ తో ఇబ్బందులు

మన దేశంలో పెళ్లికి ముందే గర్భం దాల్చడం చాలా చెడుగా చూస్తారు. పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుని అమ్మాయి గర్భం దాల్చితే అది ఆమెకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇది ఆ అమ్మాయి జీవితానికే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు సంతృప్తి చెందకపోయినా విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అమ్మాయిలు ఎవరితోనైనా శారీరకంగా సంబంధం పెట్టుకున్నాక ఆ సంబంధాన్ని వారు వదలలేరు. వీరి మానసిక స్థితి దెబ్బతింటుంది. డిప్రెషన్ బారిన కూడా పడతారు.

సామాజికంగా జరుగుతున్న మోసాలను బట్టి చూస్తే మాత్రం పెళ్లికి ముందు శారీరకంగా సంబంధాన్ని పెట్టుకోకూడదు. కొంతమంది పెళ్లికి ముందే లైంగిక సంబంధాన్ని పెట్టుకుని ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవి మీకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Whats_app_banner