OTT Revenge Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం-ott revenge thriller web series maeri to stream on zee5 ott 6th december trailer release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Revenge Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం

OTT Revenge Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం

Hari Prasad S HT Telugu
Nov 28, 2024 04:33 PM IST

OTT Revenge Thriller: ఓటీటీలోకి మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అడుగుపెట్టబోతోంది. గ్యాంగ్ రేప్‌కు గురైన తన కూతురికి న్యాయం కోసం ఓ తల్లి చేసే పోరాటం చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రాబోతోంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం

OTT Revenge Thriller: రివేంజ్ థ్రిల్లర్ జానర్ లో ఓటీటీలోకి మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు మేరీ (Maeri). ఈ మధ్యే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు గురైన కూతురికి కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మేరీ సిరీస్ తెరకెక్కింది.

మేరీ ఓటీటీ రిలీజ్ డేట్

మేరీ (Maeri) వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సిరీస్ ను డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. "న్యాయం జరగనప్పుడు ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది.

మేరీ డిసెంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది" అంటూ జీ5 గురువారం (నవంబర్ 28) వెల్లడించింది. సాయి దేవ్‌దర్ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.

మేరీ ట్రైలర్ ఎలా ఉందంటే?

మేరీ వెబ్ సిరీస్ ఓ గ్యాంగ్‌రేప్‌కు గురైన అమ్మాయి, న్యాయం కోసం ఆమె తల్లి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. సాయి దేవ్‌దర్ తన కూతురికి న్యాయం కోసం ప్రయత్నించే తల్లి పాత్రలో నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఓ అమ్మాయిని నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేస్తారు.

ఆ తర్వాత నిందితులను పోలీసులు పట్టుకున్నా.. కోర్టు వాళ్లను నిర్దోషులుగా విడుదల చేస్తుంది. అక్కడ దక్కాల్సిన న్యాయం దక్కకపోవడంతో ఇక వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పనిని ఆ తల్లి తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో ఆ అమ్మ సక్సెస్ అయిందా లేదా అన్నదే ఈ మేరీ సిరీస్ స్టోరీ. ఈ సరికొత్త రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

Whats_app_banner