(1 / 5)
ఏపీ ప్రభుత్వం ఇటీవల విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా మరోచోట సీ ప్లేన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం నుంచి సీలేరు వరకు సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
(2 / 5)
గూడెంకొత్తవీధి తహసీల్దార్ రామకృష్ణ, ఇరిగేషన్ అధికారుల బృందం సీలేరు జలాశయాన్ని బుధవారం సందర్శించింది. మారెమ్మ ఆలయం ఎదురుగా ఉన్న స్నానాల ఘాట్, మొయిన్ డ్యామ్‌ను పరిశీలించింది.
(3 / 5)
సీ ప్లేన్ ల్యాడింగ్‌కు, టేకాఫ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా..? లేదా..? అనే అంశాలను అధ్యయనం చేసింది. విశాఖనుంచి సీలేరు వరకు సీప్లేన్ నడపాలని 2017లోనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ.. కార్యరూపం దాల్చలేదు.
(4 / 5)
విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సీలేరు జలాశయాన్ని పరిశీలించామని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.
(5 / 5)
జలాపుట్ జలాశయంలోనూ సీప్లేన్ ప్రయాణానికి సిబ్బంది అధికారులు సర్వే నిర్వహించారు. సీప్లేన్ అందుబాటులోకి వస్తే సీలేరు, ధారాలమ్మ ఆలయం, రేయిన్‌గేజ్ వంటి ప్రాంతాలకు వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు