Owl significance: పురాణాల్లో గుడ్లగూబకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గుడ్లగూబను పూజిచడం వల్ల కలిగే లాభాలేంటి?-what is the uniqueness of the owl in astrology what are the benefits of worshiping the owl ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Owl Significance: పురాణాల్లో గుడ్లగూబకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గుడ్లగూబను పూజిచడం వల్ల కలిగే లాభాలేంటి?

Owl significance: పురాణాల్లో గుడ్లగూబకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గుడ్లగూబను పూజిచడం వల్ల కలిగే లాభాలేంటి?

Ramya Sri Marka HT Telugu
Nov 28, 2024 02:41 PM IST

Owl significance: ప్రజలు గుడ్లగూబను సాధారణమైన పక్షిగా భావిస్తుంటారు. వాస్తవానికి గుడ్లగూబ ఒక పవిత్రమైన పక్షి, లక్ష్మీదేవీ వాహనమని మీకు తెలుసా..? గుడ్లగూబను పూజించడం ద్వారా మన జీవితంలో శుభములు, ధనవృద్ధి, విజయాలు సాధించవచ్చు అని నమ్ముతారు.

గుడ్లగూబ దేనికి సంకేతం
గుడ్లగూబ దేనికి సంకేతం (pixabay)

భారతదేశంలో గుడ్లగూబల గురించి చాలా మందికి తెలియదు. కొందరైతే ఒక మూర్ఖపు పక్షిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తిని మూర్ఖుడిగా పిలవాలనుకుంటే ఔలే, అంటూ గుడ్లగూబతో పోల్చి తిడుతుంటారు. కానీ, హిందూ మతంలో గుడ్లగూబకు ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్యం శాస్త్రం, వేదాల్లో గుడ్లగూబకు చాలా ప్రాముఖ్యత ఉంది. గుడ్లగూబ చాలా పవిత్రమైన పక్షి అనీ, లక్ష్మీదేవి వాహనమని కూడా చెబుతుంటారు. ఈ పక్షి శక్తి, విజ్ఞానం, మాయాజాలం, రహస్యాలు వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు.

గుడ్లగూబ ఇంటికి సంపద, శ్రేయస్సును తెచ్చిపెడుతుందని చెబుతుంటారు. భూత, భవిష్యత్, వర్తమానంలో జరిగిన లేదా జరగబోయే సంఘటనలన్నీ గుడ్లగూబకు ముందే తెలుస్తాయని చెబుతుంటారు. ఈ పక్షి ప్రత్యేకత గురించి వర్ణించాలంటే, రెక్కలు విప్పకుండానే కొన్ని మైళ్ల దూరం వరకూ ఎగరగలుగుతుంది. దీని కళ్లు చూసేందుకు పగటి పూట కంటే రాత్రిపూటే ఎక్కువ దృష్టి తీవ్రతను కలిగి ఉంటాయి. అంతేకాకుండా పక్షులన్నింటి కంటే గుడ్లగూబల వినికిడి సామర్థ్యం చాలా ఎక్కువ.

లక్ష్మీ దేవి వాహనమైన గుడ్లగూబను అవమానించడం ముమ్మాటికి తప్పని నమ్ముతారు. గ్రంథాలలో పేర్కొన్న దానిని బట్టి ఈ పక్షి చాలా తెలివైన పక్షి. వాల్మీకి రామాయణంలోనూ ఇదే ప్రస్తావించారు. శ్రీ రామచంద్రుడు రావణ సంహార సమయంలో విభీషణుడ్ని గుడ్లగూబతో పోల్చాడు సుగ్రీవుడు. ఒక్కసారి గుడ్లగూబను కాకుల గూటిలోకి రానిస్తే ఆ పిల్లలను మొత్తం తినేస్తుందని గుడ్లగూబ తెలివితేటలను ప్రస్తావించాడు.

గుడ్లగూబకు జ్యోతిష్యంలో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకతలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుడ్లగూబను లక్ష్మి దేవి పక్షిగా పరిగణిస్తారు. లక్ష్మి దేవి, సంపద, విజయాలు, ధనం, శ్రేయస్సులను అందించే దేవత.కునక గుడ్లగూబను పూజించడం, సంపద లాభాలు కలిగిస్తుందని నమ్ముతారు. లక్ష్మి నారాయణ యోగం సమయంలో గుడ్లగూబను చూడడం మరింత శుభకరం.

గుడ్లగూబ దేనికి సంకేతం:

1. జ్ఞానం, వివేకం: గుడ్లగూబలు ఎప్పుడూ రాత్రిపూట చలనశీలంగా ఉంటాయి. దీని వల్ల ఇది వివేకం,అంతర్ముఖిత్త్వానికి ప్రతీకగా భావించబడుతుంది.

2. దివ్య దృష్టి: గుడ్లగూబ పక్షి తనకున్న పెద్ద కన్నుల ద్వారా చీకట్లో కూడా దూరంగా ఉన్న వాటిని చీకట్లో కూడా స్పష్టంగా చూడగలుగుతాయి. ఇది ఆత్మ పరిశీలన,శక్తివంతమైన దృష్టిని సూచిస్తుంది.

3.శక్తి, రక్షణ: గుడ్లగూబ జ్యోతిష్యశాస్త్రంలో శక్తి, రక్షణ, ప్రతీకగా కూడా పరిగణించబడుతుంది.మనలోని భయాన్ని ఎదుర్కొనడానికి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి చిహ్నంగా భావిస్తారు.

4. దుర్గతి నుండి విముక్తి: జ్యోతిష్య ప్రకారం, గుడ్లగూబలను సన్మానించడం, పూజించడం వల్ల దుర్గతి నుండి విముక్తి పొందవచ్చు.

5. రహస్యాల తెలియజేయడం: గుడ్లగూబలను రహస్యాలు, పరాకాష్ట పొందే ప్రతీకగా కూడా పరిగణిస్తారు. ఇది జీవితంలో దాగివున్న రహస్య అంశాలను అర్థం చేసుకోవడం, అవగాహన కలిగించడం, వాటిపై జ్ఞానం పొందడాన్ని సూచిస్తుంది.

6.సమయ జ్ఞానం:సమయానికి ప్రాధాన్యం ఇవ్వడం, క్షణిక విషయాలను గమనించడం, ఆత్మ అవగాహనకు ప్రేరణ ఇవ్వడం ద్వారా గుడ్లగూబ సమయ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.

గుడ్లగూబ దేనికి సంకేతం:

శుభ సంకేతం: హిందూ పురాణాల ప్రకారం గుడ్లగూబ అత్యంత శుభ సంకేతం.గుడ్లగూబను దర్శించుకోవడం వల్ల ఆత్మరక్షణ, ఆర్థిక లాభం, వ్యక్తిగత పురోగతికి పెరుగుతాయని నమ్మిక.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner