ఇవి ఎప్పుడూ మీ పర్సులో ఉంచుకున్నారంటే మిమ్మల్ని ఏ చెడు దృష్టి ఏం చేయలేదు-bring these things on your bag or purse you will not effect to any evil eye ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఇవి ఎప్పుడూ మీ పర్సులో ఉంచుకున్నారంటే మిమ్మల్ని ఏ చెడు దృష్టి ఏం చేయలేదు

ఇవి ఎప్పుడూ మీ పర్సులో ఉంచుకున్నారంటే మిమ్మల్ని ఏ చెడు దృష్టి ఏం చేయలేదు

Gunti Soundarya HT Telugu
Nov 15, 2024 11:03 AM IST

నరుల దృష్టికి నాపరాళ్ళు అయినా పగులుతాయనే నానుడి చాలా మంది వినే ఉంటారు. ఒక వ్యక్తి చెడు కన్ను బారిన పడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు ఈ చిన్న చిన్న వస్తువులు మీ వెంట ఉంచుకుంటే చాలు. ఎటువంటి చెడు కన్ను మిమ్మల్ని ఏం చేయలేదు.

నర దిష్టి నుంచి తప్పించే వస్తువులు ఇవే
నర దిష్టి నుంచి తప్పించే వస్తువులు ఇవే (pixabay)

నర దిష్టి చాలా ప్రమాదకరమైనదని మన ఇంట్లో పెద్దలు చెప్తూనే ఉంటారు. దాని వల్ల అనారోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి. అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకే ఎవరి చెడు కన్ను పడకుండా చాలా మంది కాళ్ళకు నల్ల దారం కట్టుకోవడం, ఈవిల్ ఐ గుర్తు వస్తువులు మెడలో లేదా కాళ్ళకు ధరించడం చేస్తూ ఉంటారు.

చెడు శక్తుల నుంచి బయట పడేందుకు ఇవి మాత్రమే కాదు అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని వదిలించుకునేందుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన ఇంట్లో దొరికే చిన్న వస్తువులు చాలు వీటిని ఎల్లప్పుడూ మీతో పాటు మీ వెంట ఉంచుకోవడం వల్ల చెడు దృష్టి మీ దరిచేరదు. ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

దేవుడి ఫోటో

చాలా మందికి ఉన్న అలవాటు ఇది. తమ పర్సులో ఇష్టదైవం ఫోటో పెట్టుకుంటారు. హనుమంతుడు, వినాయకుడు రక్షిస్తారని నమ్ముతారు. అందుకే మీరు నర దిష్టి బారిన పడకుండా ఉండాలని అనుకుంటే మీ పర్సు లేదా బ్యాగ్, ఆఫీసు డెస్క్ ఇలా ఎక్కడైనా మీకు ఇష్టమైన దేవుడి చిత్రపటం పెట్టుకోండి. మీ వెంట వాళ్ళు ఎప్పుడూ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మీ మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది.

నల్ల దారం

గతంలో చిన్న పిల్లల కాళ్ళకు లేదా చేతులకు నల్ల దారం లేదా వెంట్రుకలు దారంగా మార్చి కడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా కాళ్ళకు నల్ల దారాలు కట్టుకుని కనిపిస్తున్నారు. నలుపు చెడు దృష్టిని దూరం చేస్తుందని తరతరాలుగా బలంగా నమ్ముతున్న ఆచారాలలో ఇదీ ఒకటి. నల్ల దారం ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది.

లవంగాలు

కిచెన్ లో దొరికే ఈ చిన్న పదార్థం మీ జీవితాన్ని మార్చడంలో కీలకంగా పని చేస్తుంది. చెడు దృష్టిని తొలగిస్తుంది. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇవి ప్రతి ఇంటి కిచెన్ లో దొరికే సులభమైన వస్తువు ఇది. అనేక మంది పూజ చేసిన తర్వాత లవంగాలు కాల్చి ఆ పొగను ఇల్లంతా వ్యాపింప చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే దీని నుంచి వెలువడే వాసన గాలిని శుద్ది చేస్తుంది. వీటిని పర్సు లేదా జేబులో మీ వెంట ఉంచుకుంటే మంచిది.

యాలకులు

చెడు కన్ను తొలగించడంలో యాలకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. లవంగాలు మాదిరిగానే వీటిని కూడా కాలుస్తారు. రక్షణ స్వభావం వీటికి ఉంటుంది. కొన్ని యాలకులు మీ పర్సులో ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవాలి. వాటి వాసన కూడా మనసుకు హాయిని ఇస్తుంది.

పంచముఖి హనుమంతుడి ఫోటో

తన భక్తులకు ఏ ఆపద వచ్చిన అభయ హస్తం అందిస్తాడు హనుమంతుడు. ధైర్యం, రక్షణ, బలాన్ని ఇచ్చే దేవుడిగా పూజిస్తారు. మీకు చెడు దృష్టి, ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని అనిపిస్తే మీరు పర్సులో పంచముఖి ఆంజనేయుడి చిత్ర పటం ఉంచుకోవచ్చు. లేదంటే లాకెట్ గా మెడలో ధరించవచ్చు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner