Game Changer Teaser: ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ - రామ్ చ‌ర‌ణ్ మూవీనే ఫ‌స్ట్‌!-ram charan game changer teaser release event date and venue fixed director shankar kiara advani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Teaser: ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ - రామ్ చ‌ర‌ణ్ మూవీనే ఫ‌స్ట్‌!

Game Changer Teaser: ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ - రామ్ చ‌ర‌ణ్ మూవీనే ఫ‌స్ట్‌!

Nelki Naresh Kumar HT Telugu
Nov 05, 2024 12:46 PM IST

Game Changer Teaser: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌కాబోతోంది. టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో నిర్వ‌హించ‌బోతున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న అవుతోంది.

గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్
గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్

Game Changer Teaser: గేమ్‌ ఛేంజ‌ర్ టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ గుడ్‌న్యూస్ వినిపించింది. టీజ‌ర్ రిలీజ్ డేట్‌తో పాటు ప్లేస్‌ను కూడా అనౌన్స్‌చేసింది. గేమ్ ఛేంజ‌ర్ మూవీ టీజ‌ర్‌ను న‌వంబ‌ర్ 9న టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో జ‌రుగ‌నుంది. భారీ ఎత్తున ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌కు రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో పాటు మూవీ టీమ్ మొత్తం అటెండ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ల‌క్నోలో సినిమా ఈవెంట్‌ను జ‌రుపుకోనున్న ఫ‌స్ట్ తెలుగు మూవీగా, పాన్ ఇండియ‌న్ మూవీగా గేమ్ ఛేంజ‌ర్ నిల‌వ‌నుంది.

శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ…

రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ శంక‌ర్ క‌ల‌యిక‌లో ఫ‌స్ట్ టైమ్ వ‌స్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. శంక‌ర్ గ‌త సినిమాల‌ స్టైల్‌లోనే సామాజిక సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి గేమ్ ఛేంజ‌ర్ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

డైరెక్ట‌ర్‌గా శంక‌ర్ చేస్తోన్న ఫ‌స్ట్ తెలుగు మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. శంక‌ర్ గ‌త మూవీ ఇండియ‌న్ 2 డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌న్న‌ది టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

డిసెంబ‌ర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్‌...

గేమ్ ఛేంజ‌ర్ మూవీ సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతోంది. తొలుత ఈ మూవీని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ బ‌డ్జెట్ ప‌రంగా సంక్రాంతి అయితేనే క‌లిసివ‌స్తుంద‌నే ఆలోచ‌న‌తో పండుగ‌కు షిఫ్ట్ అయ్యారు. రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌ కోసం చిరంజీవి విశ్వంభ‌ర సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న‌ది.

కియారా అద్వానీ హీరోయిన్‌...

గేమ్ ఛేంజ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ కాంబోలో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇందులో శ్రీకాంత్‌, న‌వీన్‌చంద్ర‌, అంజ‌లి, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో గేమ్ ఛేంజ‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. 110 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు.

ఉప్పెన ద‌ర్శ‌కుడితో...

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో రామ్‌చ‌ర‌ణ్ ఓ రా అండ్ ర‌స్టిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోన్నాడు. న‌వంబ‌ర్ నెలాఖ‌రు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner