AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్-ar rahman saira banu may reconsider divorce reveals lawyer vandana shah ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ar Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్

AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా బాను మళ్లీ కలిసిపోనున్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఇద్దరి విడాకులపై లాయర్ వందనా షా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్ (AP)

AR Rahman Divorce: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన మూడు దశాబ్దాల వివాహ బంధానికి తెరదించి విడాకులు తీసుకుంటున్నాడన్న వార్త వైరల్ అయిన సంగతి తెలుసు కదా. అయితే వాళ్ల పిల్లల కస్టడీ, విడాకుల విషయం పునరాలోచనలాంటి అంశాలపై లాయర్ వందనా షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పిల్లల కస్టడీ ఎవరికి?

విక్కీ లాల్వానీ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయర్ వందనా షా.. ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకుల విషయంపై స్పందించారు. ఇద్దరూ విడిపోతే వాళ్ల ముగ్గురు పిల్లలు ఎవరి దగ్గర ఉంటారని ప్రశ్నించగా.. "ఈ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ వాళ్లలో కొందరు యుక్త వయసు వాళ్లు. ఎవరి దగ్గర ఉండాలో వాళ్లు ఎంపిక చేసుకోవచ్చు" అని వందనా చెప్పారు.

ఇక విడాకులు ఖాయమైతే రెహమాన్ భారీ భరణం చెల్లించాల్సి వస్తుందన్న వార్తలపై వందనా స్పందిస్తూ.. దీనిపై తాను ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నారు. కానీ సైరా డబ్బు కోసం ఆలోచించే మనిషి కాదని మాత్రం చెప్పారు. ఈ ఇద్దరూ 1995లో పెళ్లి చేసుకున్నా.. ఇప్పటి వరకూ సైరా పెద్దగా పబ్లిక్ లో కనిపించలేదు.

ఇద్దరూ మళ్లీ కలిసిపోతారా?

ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు పక్కన పెట్టి మళ్లీ కలిసిపోయే అవకాశాలను కూడా వందనా షా కొట్టి పారేయకపోవడం గమనార్హం. "ఇద్దరి మధ్య సయోధ్య కుదరదని నేను అనలేదు. నేను ఆశావహురాలిని. నేనెప్పుడూ ప్రేమ, రొమాన్స్ గురించి మాట్లాడుతుంటాను. వాళ్ల సంయుక్త ప్రకటన స్పష్టంగా ఉంది. వాళ్లు బాధ, వేరుపడటం గురించి చెప్పారు. వాళ్లది సుదీర్ఘ ప్రయాణం. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలానే ఆలోచించి ఉంటారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరదని మాత్రం నేనెప్పుడూ చెప్పలేదు" అని వందనా షా అన్నారు.

కొన్ని రోజుల కిందట ఏఆర్ రెహమాన్ తాను విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి షాక్ కు గురి చేశాడు. 29 ఏళ్లు కలిసి ఉన్న వీళ్లు ఇప్పుడు విడిపోవడం ఏంటన్న చర్చ మొదలైంది. ఈ ఇద్దరికీ ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీళ్లలో ఖతీజాకు పెళ్లి కూడా అయింది. ఇప్పుడు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు లాయర్ వందన చెప్పారు.